తెలుగు చిత్ర పరిశ్రమలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆయన తన గాత్రంతో కోట్లాది మంది శ్రోతల మదిని రంజిపజేశాడు. ఆయన దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ తన గాత్ర మాధుర్యంతో కోట్లాది ప్రజలను మైమరిపించారు. ఇక బాలు వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆయన అసలు పేరు శ్రీప‌తి పండితారాధ్యుల బాల సుబ్ర‌హ్మ‌ణ్యం. కానీ అంద‌రికీ ఆయ‌న‌ బాలుగా సుపరిచితుడైయ్యారు.

బాలు పాట‌లు పాడ‌టంతోపాటు కొన్ని సినిమాల‌కు ఆయ‌న సంగీత ద‌ర్శ‌క‌త్వం కూడా వ్యవహరించారు. అంతేకాదు.. ఆయన కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందారు. అంతేకాదు.. బాలు నిర్మాతగానూ వ్యవహరించాడు. ఆయన నటించిన మిథునం సినిమా బాలుకి నటుడిగానూ మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. అంతేకాక.. ‘ఓ పాపా లాలీ’ అనే చిత్రంలో ఆయన నటననూ ఇప్పటికీ స్మరించుకుంటారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఆ సినిమాలో బాలు స్వయంగా ఒక బ్రీత్ లెస్ సాంగ్ పడి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. అయితే తెలుగులో బ్రీత్‌లెస్ సాంగ్స్‌కి ఆయనే ఆద్యుడని చెప్తారు.

అయితే 40ఏళ్ల‌లో బాలు 40,000 పాట‌లను పాడారు. ఇక వీటిలో సినిమా పాట‌ల‌తోపాటు భ‌క్తి గీతాలూ కూడా ఉన్నాయి. బాలు గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు. అంతేకాదు.. 1981 ఫిబ్ర‌వ‌రి 8న క‌న్న‌డ సంగీత ద‌ర్శ‌కుడు ఉపేంద్ర కుమార్ కోసం ఉద‌యం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వ‌ర‌కూ 21 క‌న్న‌డ‌ పాట‌లు పాడి బాలు రికార్డు సృష్టించారు. బాలు ప్లేబ్యాక్ సింగ‌ర్‌గా ఆరు నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డులు అందుకున్నారు. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నుంచి 25 నంది అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు. అంతేకాక.. 2001లో కేంద్ర ప్ర‌భుత్వం బాలుని ప‌ద్మ శ్రీతో సత్కరించగా.. 2011లో ఆయ‌న‌కు ప‌ద్మ విభూష‌ణ్ కూడా అందుకున్నారు. బాలు త‌మిళంలో ఒకే రోజు 19 పాట‌లు, హిందీలో ఒకే రోజు 16 పాట‌లు పాడారు. ఆయన నేటితరం గాయకులకు స్ఫూర్తిదాయకం.

మరింత సమాచారం తెలుసుకోండి: