మెగాస్టార్ చిరంజీవి, తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం స్టాలిన్.ఈ సినిమా తమ అభిమానులను,ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో అక్క మాట జవదాటని తమ్ముడు గా చిరంజీవి నటించాడు. ఇక ఈ సినిమాలో అక్క గా కుష్బూ నటించింది. ఈ సినిమా 2006 సంవత్సరం సెప్టెంబర్20 న విడుదలైంది.

ఇక ఈ సినిమా  దాదాపుగా 396  థియేటర్లలో 500కు పైగా ప్రింట్లతో విడుదలై వారంలోనే 20 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమానే నాగబాబు నిర్మించాడు.ఈ సినిమాకి పోటీగా వచ్చిన సినిమాల విషయానికి వస్తే.. ఇక ఈ సినిమా విడుదలైన వారానికి నాగార్జున నటించిన బాస్ మూవీ విడుదల అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

ఇక మరొక యంగ్ హీరో సెప్టెంబర్ 29న సీతాకోక అనే సినిమాను విడుదల చేశాడు హీరో నవదీప్. ఇక ఈ చిత్రం కూడా భారీ డిజాస్టర్ ను చవిచూసింది. ఇక ఇదే రోజున మలయాళ స్టార్ మమ్ముట్టి నటించిన మహానగరంలో మాయగాడు అనే సినిమా విడుదల కాగా ఈ సినిమా కూడా ఫ్లాప్ లిస్ట్ లోకి వెళ్లి పోయింది. సీరియల్ యాక్టర్ అయినటువంటి కరుణ నటించిన ప్రామిస్ అనే చిత్రం కూడా ఫ్లాప్ లిస్ట్ లోకి వెళ్లి పోయింది.

ఇక స్టాలిన్ సినిమా కంటే ముందుగా విడుదలైన సినిమాలు సెప్టెంబర్ 15న గంగా సినిమా విడుదల కాగా అది కూడా ఫ్లాప్ గా నిలిచింది. ఇక రామ్ గోపాల్ వర్మ 2006 హిందీ లో  తీసిన శివ సినిమా కూడా ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఇక సెప్టెంబర్ 14న వచ్చిన వనజ అనే సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఏకంగా అవార్డుల పంటను పండించింది. కానీ ఈ సినిమా థియేటర్ లో ఫెయిల్ అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: