భారతీయ చలనచిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎంతలా ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా  చెప్పాల్సిన పని లేదు. అవకాశాలు రావాలి అంటే పక్క లోకి వెళ్లాల్సిందే..  లేదంటే చిత్ర పరిశ్రమలో రాణించడం చాలా కష్టం అంటూ ఇప్పటికే ఎంతోమంది నటీమణులు కెరియర్ మొదట్లో తమకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుని సంచలనమే సృష్టించారు.  చిత్ర పరిశ్రమలో కనుమరుగైన హీరోయిన్లు మాత్రమే కాదు స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారు సైతం..  క్యాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ సంచలన విషయాలను బయట పెట్టడం సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపేసింది. ఈ క్రమంలోనే మీ టు అనే ఉద్యమం కూడా ప్రారంభమైంది.



 బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రారంభమైన మీ టు టాలీవుడ్ కి కూడా పాకిపోయి సెన్సేషన్ సృష్టించిన అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మీ టూ ఉద్యమంలో భాగంగా శ్రీ రెడ్డి చేసిన అర్ధనగ్న నిరసనలు దేశవ్యాప్తంగా సంచలనం గానే మారిపోయాయి.  అయితే ఇప్పటికి కూడా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు తమ కెరియర్లో ఎదురైన చేదు అనుభవాలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవటం చేస్తూ ఉంటారు.  ఇలా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా తన అందచందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన మల్లికా శెరావత్ ఇటీవలే క్యాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.



 నేను నేరుగా ఎప్పుడూ నా కెరియర్లో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కోలేదు. కానీ ఎంతో మంది నటులు నాకు ఎంతగానో దగ్గర అవ్వాలని ప్రయత్నించారు అంటూ చెప్పుకొచ్చింది మల్లికా శెరావత్. తెర మీద ఎంత బోల్డ్ గా కనిపిస్తే తమతో  అంతే బోల్డ్ గా ఉండగలవ్ అంటూ తనతో చెప్పేవారని సోషల్ మీడియాలో తెలిపింది. ఇక అలాంటి నటులు సినిమాల్లో ఎలా ఉండేవారో.. బయట కూడా అలాగే ఉండేవారంటు తెలిపింది. ఈ క్రమంలోనే కాంప్రమైజ్ అవ్వడం ఇష్టం లేక..  పెద్ద హీరోలతో సినిమాలు చేయడానికి ఒప్పుకోలేదని.. ఎన్నో అవకాశాలను వదులుకున్నాను అంటూ మల్లికా శెరావత్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: