ఈరోజు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవ్ స్టోరీ చిత్రం మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని  బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతుంది. నాగచైతన్యకు చాలా రోజుల తర్వాత సోలో హిట్ ను సంపాదించుకోగా సాయి పల్లవి కూడా తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. శేఖర్ కమ్ముల తో కలిసి ఫిదా సినిమా తో సూపర్ హిట్ చేసుకున్న తర్వాత ఆమెకు పెద్ద హిట్ దక్కలేదనే చెప్పాలి. ఇప్పుడు అదే శేఖర్ కమ్ముల తో ఆమె లవ్ స్టోరీ సినిమా చేసి మరొక సూపర్ హిట్ ను అందుకుని తన పాపులారిటీని ఇంకా పెంచుకుంది.

ఇక పోతే ఈ సినిమాలో చై, సాయి పల్లవి ల నటన ఆద్యంతం ప్రేక్షకులను ఎంతగానో కనువిందు చేసింది. అయితే హీరో హీరోయిన్ లే కాక వేరే పాత్రలు కూడా ఈ సినిమాలో ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విలన్ గా నటించిన రాజీవ్ కనకాల పాత్ర అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు మంచి మంచి పాత్రలు చేసుకుంటూ వచ్చిన రాజీవ్ కనకాల ఈ సినిమాలో కుల పిచ్చి పట్టిన పెద్దమనిషిగా నటించి ప్రేక్షకులను తన రౌద్రం తో ఎంతగానో కనువిందు చేశాడు.

చివర్లో ఈయన గురించి తెలిసిన ఓ ట్విస్ట్ ప్రేక్షకులను ఇంకా బాగా అలరించింది అని చెప్పవచ్చు. ఈ పాత్రకు తనే బెస్ట్ ఛాయిస్ అని నిరూపించుకున్నాడు రాజీవ్ కనకాల. ఇటీవలి కాలంలో పెద్దగా గుర్తింపు లేని పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చిన రాజీవ్ కనకాల కి ఇది కెరీర్ బెస్ట్ పాత్ర అని చెప్పవచ్చు. చాలా రోజుల తర్వాత తన నటనతో ప్రేక్షకులను బాగా అలరించారు. ఇక ఈ సినిమా లో మరికొన్ని ముఖ్యమైన పాత్రలు ఏమిటంటే హీరో తల్లి గా ఈశ్వరి పాత్ర మరియు  హీరోయిన్ తల్లి పాత్ర చేసిన దేవకి పాత్ర.  ఈ సినిమాలో అత్యంత కీలకమైన సమయంలో వచ్చే ఈ రెండు పాత్రలు ఎంతో బాధ్యతగా డిజైన్ చేయబడి సినిమా హిట్ కు ముఖ్య కారణాలుగా నిలిచాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: