అక్కినేని నాగచైతన్య లవ్ స్టోరీ చిత్రం తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కరోనా మహమ్మారి మూడవ దశ ముప్పు పొంచి ఉందని చెబుతున్న నేపథ్యంలో జనం బయటకు రావడానికి ఇంకా భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్ల లోకి రావడనికి వారిని ఒప్పించడం చాలా కష్టమైపోతుంది. కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు ఓపెన్ అయినా కూడా సరిగ్గా ప్రేక్షకులు రాకపోవడంతో తెలుగు సినిమా భవిష్యత్తు ఏమైపోతుందో అని అందరూ ఎంతో టెన్షన్ పడిపోయారు.

కానీ లవ్ స్టోరీ చిత్రం వచ్చాక ప్రేక్షకులు ఎలాంటి కరోనా వచ్చిన పట్టించుకోని రీతిలో థియేటర్లకు తరలివస్తున్నారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ దిశగా వెళుతుండగా ఈ సినిమా పై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి.  సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కగా విడుదలకు ముందు నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఈ చిత్రంపై ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా సూపర్ హిట్ గా దూసుకుపోతుంది. తొమ్మిది వందల థియేటర్ లకు పైగా ఈ సినిమా విడుదల కాగా ఆరు నుంచి ఏడున్నర కోట్ల షేర్ వసూలు చేసి నాగచైతన్య కెరీర్ నే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎనిమిది కోట్ల రూపాయల కలెక్షన్లను వసూలు చేసింది ఫ్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 27 కోట్లు చేసిన ఈ సినిమా బ్రేక్ రావాలంటే 32 కోట్లు రావాల్సి ఉండగా ఈ వీకెండ్ లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి అగ్రరాజ్యం అమెరికాలో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ కూడా రెండు వందల ఇరవై నాలుగు ప్రాంతాల్లో ఈ సినిమా అక్కడ కూడా భారీ వసూళ్లు సాధించాయి అమెరికాలో తొలి రోజు మూడు కోట్ల కలెక్షన్స్ వచ్చాయి తర్వాత ఇంత భారీ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా లవ్ స్టోరీ నిలిచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: