ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఒక్క‌సారిగా టిక్కెట్ల రేట్ల‌ను చాలా వ‌ర‌కు త‌గ్గిం చేయ‌డంతో పాటు ఇటు షోల‌ను ఎక్కువ వేయ‌కుండా కంట్రోల్ చేయ‌డం.. బెనిఫిట్ షో లు పూర్తిగా క్యాన్సిల్ చేయ‌డం లాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌డంతో ఇండ‌స్ట్రీ అంతా పైకి ఏమీ అన‌క పోయినా లోలోన మాత్రం ర‌గులుతోంది. చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు ఇండ‌స్ట్రీ వాళ్లు ఆయ‌న ఎంత చేసినా .. పెద్ద హీరోల సినిమాల‌కు టిక్కెట్ రేట్లు పెంచుకుని అమ్ముకోమ‌ని ప‌ర్మిష‌న్లు ఇచ్చినా, పండ‌గ స‌మ‌యంలో అద‌న‌పు షోల‌కు అనుమ‌తులు ఇచ్చినా కూడా ఆయ‌న్నే తిట్టేవారు. ఇక ఎన్నిక‌ల స‌మ‌యంలో చాలా మంది సినిమా వాళ్లు జ‌గ‌న్ ప్రాప‌కం కోసం బాబును ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు.

క‌ట్ చేస్తే ఇప్పుడు జ‌గ‌న్ సీఎం అయ్యారు. ఆయ‌న చ‌ర్య‌ల‌తో ఇండ‌స్ట్రీ అంతా ఇబ్బంది ప‌డుతోంది. రేట్ల‌ను త‌గ్గిం చేయ‌డానికి తోడు ఇప్పుడు ఏకంగా టిక్కెట్ల‌ను కూడా ప్ర‌భుత్వ‌మే ఆన్ లైన్‌లో అమ్ముతామ‌ని చెప్ప‌డంతో వాళ్ల మాట ప‌డిపోయింది. ఇక ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ సినిమా ఫంక్ష‌న్ వేదిక‌గా జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి వార్నింగ్‌లు ఇస్తున్నారు. ప‌వ‌న్ ఆవేద‌న‌లో అర్థం ఉంది. అయితే ఇక్క‌డ మ‌రో వైపు కొన్ని  క్వ‌శ్చ‌న్స్ కూడా రైజ్ అవుతున్నాయి. పెద్ద హీరోల సినిమాలు అంటే ఏంట‌ని కొంద‌రు నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

బాహుబ‌లి, ఆర్ ఆర్ ఆర్‌, మ‌గ‌ధీర లాంటి సినిమాలు భారీ బ‌డ్జెట్ తో వ‌చ్చాయి. కొంద‌రు స్టార్ హీరోలు తీసే నాసిర‌కం సినిమాల‌కు కూడా రు. 400 - 500 టిక్కెట్లు పెట్టి అమ్ముకుంటారా ? అని ప్ర‌శ్నిస్తున్నారు.  హిందీలో పింక్‌ను రు. 10 కోట్ల‌తో తీశారు. అదే తెలుగులో వ‌కీల్ సాబ్ ఏకంగా రు. 100 కోట్ల సినిమా అని చెప్పారు. ఇందుకు కార‌ణం ప‌వ‌న్ రెమ్యున‌రేష‌నే రు. 55 కోట్లు. మ‌రి ఇన్ని కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోన్న ప‌వ‌న్ ఎన్ని కోట్లు ట్యాక్స్ క‌ట్టాడు అన్న‌ది మాత్రం చెప్ప‌లేరు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ దోపిడీకి కొంత వ‌ర‌కు అయినా చెక్ పెట్టేందుకే ఈ నిర్ణ‌యం తీసుకుంది. దీనికే ఏదో పెడ‌బొబ్బ‌లు పెట్టేస్తూ ఎందుకు అర‌చి గీ పెడుతున్నార‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ఏదేమైనా టిక్కెట్ల దోపిడీతో సామాన్యుడిని దోచుకుంటోన్న వ్య‌వ‌స్థ‌కు జ‌గ‌న్ బ్రేక్ వేసినందున స్టార్ల బాధ‌లు మామూలుగా లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: