యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కెజిఎఫ్ చాప్టర్ 1 మూడేళ్ళ క్రితం ఆడియన్స్ ముందుకు వచ్చి ఎంత పెద్ద సక్సెస్ కొట్టిందో అందరికీ తెలిసిందే. వాస్తవానికి కన్నడలో రిలీజ్ కావలసిన ఆ మూవీ కి సంబందించిన కొన్ని సన్నివేశాలు చూసిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి, దీనిని కేవలం కన్నడకు మాత్రమే పరిమితం చేయవద్దు, పాన్ ఇండియా గా రిలీజ్ చేయమని చెప్పడం, తరువాత మేకర్స్ దానిని పలు భాషల్లో రిలీజ్ చేసి అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు కొట్టడం జరిగింది.

ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందించారు. ఇక ఇటీవల ఈ సినిమాకి కొనసాగింపుగా ప్రారంభం అయిన కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోగా ప్రస్తుతం దానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. మొదటి పార్ట్ కంటే కూడా ఎంతో భారీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా హోంబలె ఫిలిమ్స్ వారు తీసిన ఈ సినిమాలో తెలుగు నటుడు రావురమేష్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనుండగా బాలీవుడ్ ఆక్టర్ సంజయ్ దత్ మెయిన్ విలన్ పాత్ర చేస్తున్నారు. రవీనా టాండన్, ఈశ్వరి రావు తదితరులు ఇతర పాత్రలు చేస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

వాస్తవానికి హోంబలె బ్యానర్ పై ప్రస్తుతం ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న సలార్ మూవీని అదే డేట్ కి రిలీజ్ చేద్దాం అని భావించిన మేకర్స్, దానిని మరికొన్ని నెలలు వాయిదా వేసి ఆ స్థానంలో కెజిఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ ని అనౌన్స్ చేసారు. అయితే ఇటీవల మెల్లగా పలు రాష్ట్రాల్లో థియేటర్స్ తెరుచుకుంటూ ఉండడంతో కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీని మేకర్స్ మరింత ముందుగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదు, తాము మొదట ప్రకటించిన విధంగానే సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 14 రిలీజ్ అవడం పక్కా అంటూ దర్శకనిర్మాతలు నేడు మరొక్కసారి ఆ డేట్ ని ఫైనలైజ్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. కాగా ఈ సినిమాపై యావత్ భారతదేశంలోని ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న విషయం తెల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: