రాజకీయ ఎన్నికలను తలపించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఇటీవలే ముగిసాయి.  ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠకు తెరపడింది. ఎవరూ ఊహించని విధంగా మంచు విష్ణు మా అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయం సాధించారు.  ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ పై భారీ ఓట్ల తేడాతో విజయం సాధించారు మంచు విష్ణు. అదే సమయంలో అటు ప్రకాష్ రాజు  ప్యానల్ నుంచి మరికొంత మంది విజయం సాధించడం గమనార్హం. కాగా నిన్న ఎన్నికలు జరగడానికి ముందు వరకు కూడా ప్రకాష్ రాజు మంచు విష్ణు మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు జరిగాయి. ఏకంగా రాజకీయ ఎన్నికల తరహాలోనే అందరిని ఆకట్టుకోవడానికి ఇద్దరు కూడా భారీగానే ఆ హామీలు ఇచ్చారు.



 అదే సమయంలో ఏకంగా ఇద్దరి ప్యానల్ కు చెందిన సభ్యులు కూడా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం చేశారు. ఇలా సినీ సెలబ్రిటీలు అందరూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో రచ్చరచ్చ చేశారు అని చెప్పాలి. కానీ ఎట్టకేలకు ఇటీవల జరిగిన పోలింగ్ తో మా ఎన్నికల రచ్చ కు తెరపడింది.  చివరికి మంచు విష్ణు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికల్లో విజయం సాధించారు.  ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో ఇద్దరూ ఒకే చోట నిలబడి ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం లాంటివి కూడా చేసారు. తామంతా ఒక్కటే అన్న విషయాన్ని చాటి చెప్పారూ ప్రకాష్ రాజు, మంచు విష్ణు?



 అయితే అప్పటి వరకు మా ఎలక్షన్స్ నేపథ్యంలో ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్న వీరు ఒక్కసారిగా కలిసిపోవడం మాత్రం అందరినీ షాక్ కి గురి చేసింది అని చెప్పాలి. అయితే ఇక ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత మంచు విష్ణు విజయం సాధించిన విషయాన్ని ప్రకటించారు. అయితే ఇలా ప్రకటించిన సమయంలో ఏకంగా పక్కనే ఉన్న ప్రకాష్ రాజ్ ను  ఆలింగనం చేసుకుని మంచు విష్ణు కన్నీళ్లు పెట్టుకున్నాడు.  ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఎన్నికల సమయంలో తమ మధ్య ఎంత పోటీ ఉన్నప్పటికీ.. ఎన్నికలు ముగిశాక మాత్రం తామంతా ఒక్కటే అని మంచు విష్ణు ఈ ఒక్క సంఘటనతో చెప్పకనే చెప్పాడు అని అందరూ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Maa