హోరాహోరీగా జరిగిన మా ఎన్నికల ఘట్టం ముగిసింది అనుకుంటే పొరపాటే, పోటీ ముగిసింది కానీ నువ్వా నేనా అన్న వాదనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మా అధ్యక్ష ఎన్నికలు సీనియర్ నటుల మధ్య వివాదాలకు వారధిగా మారుతుందా అంటే ..ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ముఖ్యంగా మోహన్ బాబు వర్గానికి మెగాస్టార్ చిరంజీవి వర్గానికి మధ్య విభేదాలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. మా ఎన్నికల పోరు మొదలైంది మొదలు నేటి వరకు కూడా ఇరు వర్గాల మధ్య విమర్శల వర్షం కురుస్తోంది. ఇరు సీనియర్ నటులు కూడా మాటల తూటాలు విసురుకుంటున్నారు. పాతికేళ్లకు పైగా కొనసాగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ప్రభజనం మొదలయ్యింది.

వరుస రాజీనామాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ముందుగా నాగబాబు మరియు ప్రకాష్ రాజు తమ మా సభ్యత్వాలకు రాజీనామా చేయగా, ఇప్పుడు ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుండి గెలిచినటువంటి మొత్తం 11 మంది సభ్యులు వారి పదవులకు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఇంకా ఎంతమంది మా నుండి బయటకు వస్తారో అన్నది చర్చనీయాంశంగా మారింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అన్నది కేవలం ఒక టీం కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే పాలనా చేస్తుంది. తర్వాత మళ్ళీ కొత్త పాలకవర్గం వస్తుంది. అంత మాత్రం దానికి ఈ వివాదాలు, గొడవలు, విమర్శలు, రాజీనామాలు ఎందుకు అన్నది తెలుగు ప్రేక్షకులకు అర్ధం కావడం లేదు. పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ ఫంక్షన్ లో కొన్ని వ్యాఖ్యలు చేసి ఉండకుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదేమో.

ఆ మీటింగ్ నుండే మంచు కుటుంబంలో ఎలాగైనా మా అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలనే కసి పెరిగింది. అయితే ఓటమిని అంగీకరించడం కూడా గొప్ప గుణం. కానీ అది అందరికీ ఉండకపోవచ్చు. ప్రకాష్ రాజ్ ఈ ఓటమిని తీసుకోలేకపొయాడు. అందుకే మా సభ్యులను కూడా కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. ఈ మా వివాదం ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి. ఓడిపోయినా ప్రకాష్ రాజ్ ను తన మాటలతో ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదని తెలుస్తోంది. అయినా ప్రకాష్ రాజ్ అలా అనడం మా సభ్యులకు ఇష్టపడడం లేదు.  మరి ఈ సమస్యను ఇండస్ట్రీ పెద్దలుగా చెప్పుకుంటున్న వారు ముందుకు వచ్చి పరిష్కరిస్తారా? లేదా మా రెండుగా చీలిపోతుందా అన్నది తెలియాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: