జ్యోతిక కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా సుపరిచితమే. ఆమె అందం అభినయంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్. చంద్రముఖిలో ఆమె నటన ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు అయితే బ్యూటీ తెలుగులో ఆమె వరకు వచ్చిన కొన్ని బ్లాక్ బస్టర్ మూవీ లో ఆఫర్లను వదులుకుంది. అందుకు కారణం ఉన్నప్పటికీ జ్యోతిక సినిమాలు వదులుకోవడం గురించి తెలిసిన అభిమానులు కచ్చితంగా బాధపడతారు. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో చేజార్చుకుంది జ్యోతిక. ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

జ్యోతిక చిరంజీవి సరసన ఠాగూర్ చిత్రంలో నటించి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులలో ప్రదర్శించబడింది. అంతే కాదు మా కమర్షియల్గా కూడా మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆమె నాగార్జునతో కలిసి మాస్ సినిమాలో నటించింది. ఈ చిత్రం నాగార్జున కెరీర్లోనే మర్చిపోలేని చిత్రం అన్న విషయం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తెలుగులో ఆమె చివరి చిత్రం రవితేజ నటించిన షాక్. రాంగోపాల్ వర్మ నిర్మించిన ఈ చిత్రం ఆమెకు నిజంగానే షాక్ ఇచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులతో పాటు మేకలు కూడా నిరాశ పరిచింది. ఆ తర్వాత ఆమెకు తెలుగులో స్టాలిన్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఇంకా వెంకటేష్ సరసన లక్ష్మీ లో కూడా అవకాశం వచ్చింది. కానీ అప్పటికి జ్యోతిక పెళ్లి సన్నాహాల్లో ఉండడం వల్ల ఆ ఆఫర్లను తిరస్కరించింది. ఆ తర్వాత కూడా వెంకటేష్ తో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. పెళ్లి కారణంగానే ఈ అవకాశాన్ని వదులుకుంది. దీంతో అవకాశం త్రిషను వరించింది. ఇక ఇటీవల నాని హీరోగా నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయిలో ఫ్రొం కోసం జ్యోతిక ని సంప్రదించారట మేకర్స్. కానీ జ్యోతిక ఈ ఆఫర్ ను తిరస్కరించడంతో భూమిక అందులో కనిపించింది. తెలుగులో జ్యోతిక వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!

మరింత సమాచారం తెలుసుకోండి: