సినిమా ఇండస్ట్రీలో స్టార్ లుగా ఉన్న వారు రిలేషన్ షిప్ లో ఉండడం సహజమే. ఇది ఎక్కువగా బాలీవుడ్ లో జరుగుతూ ఉంది. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత బోణీ కపూర్ కొడుకు అర్జున్ కపూర్ కొంత కాలంగా మలైకా అరోరాతో డేటింగ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ 2019 లో మలైకా పుట్టిన రోజు నాడు సోషల్ మీడియా ద్వారా తమ రిలేషన్ ను తెలియచేశారు. అయితే మొదట్లో వీరి రిలేషన్ పై పలు విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఉన్న వయసు బేధం కూడా ఒక కారణమే. అయితే వీరిద్దరూ అవేమీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ ఉన్నారు. ఇదిలా ఉంటె ఇటీవల ఒక ఒక ఫాషన్ షో లో భాగంగా మలైకా అరోరా వైట్ గౌన్ లో దర్శనమిచ్చింది.

ఈ గౌన్ లో ఆమె అందాల అప్సరసలా ఉంది. అయితే ఈ షో అయ్యాక పాల్గొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆమెను ఒక విలేఖరి ఈ విధముగా అడిగారు. మీరు మీ పెళ్ళిలో ఏ విధమైన వస్త్ర ధారణలో ఉండాలని అనుకుంటున్నారు. ఈ ప్రశ్నకు మలైకా నా వెడ్డింగ్ లో మొత్తం వైట్ డ్రెస్ లోనే ఉండాలని ఉంది అని సమాధానమిచ్చింది. అయితే ఎందుకు వైట్ డ్రెస్ ప్రిఫర్ చేశారు అని మరొకరు అడిగిన ప్రశ్నకు, ఎంతో సంప్రదాయమైన వేడుకకు ప్రశాంతతకు గుర్తు అయిన వైట్ డ్రెస్ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది.

అయితే ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్ ఎంతో మంది లాగే డేటింగ్ తో ముగుస్తుందా లేదా మూడు మూళ్ళ బంధంతో ఒక్కటి అవుతుందా అన్నది తెలియాలంటే మరి కొంత కాలం వరకు ఆగాల్సిందే అంటున్నారు నెటిజన్లు. కాగా ప్రస్తుతం ఇద్దరూ వారి వారి ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు..
మరింత సమాచారం తెలుసుకోండి: