ఇటీవలే నాగచైతన్య సాయి పల్లవి జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవ్ స్టోరీ సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన సరికొత్త ప్రయోగం సక్సెస్ అయింది అనే చెప్పాలి. ప్రతి సినీ ప్రేక్షకుడికి కూడా ఈ సినిమా కథ ఎంతగానో హృదయాన్ని హత్తుకుంది.  అంతలా నాగచైతన్య సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి విజయాన్ని సాధించింది. విడుదలైన నాటి నుంచి మంచి టాక్ ను సొంతం చేసుకోవడమే కాదు మంచి వసూళ్లను రాబట్టింది ఈ సినిమా.


 ఎన్నో రోజుల నుంచి లవ్ స్టోరీ సినిమా విడుదల వాయిదా పడుతూ ఉండగా ఇక ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మిడిల్ క్లాస్ కష్టాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని చూపిస్తూ నేటి రోజుల్లో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి కూడా చూపిస్తూ ఏకంగా సభ్య సమాజానికి దర్శకుడు శేఖర్ కమ్ముల ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు అని చెప్పాలి. అయితే ప్రేక్షకులు ఎంతగానో అలరించిన లవ్ స్టోరీ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.



 అదేంటి మొన్ననే కదా లవ్ స్టోరీ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు విడుదల ఏంటి అని షాక్ అవుతున్నారు కదా.  అయితే ఈసారి విడుదల అవుతుంది తెలుగులో కాదు మలయాళంలో. తెలుగు ప్రేక్షకులు అందరినీ ఎంతగానో ఆకర్షించి మంచి విజయాన్ని సాధించిన లవ్ స్టోరీ సినిమా ఇప్పుడు మలయాళ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 23 వ తేదీన ఇక ఈ సినిమా మలయాళం లాంగ్వేజ్ లో అటు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. థియేటర్ లో విడుదల కాబోతున్న తెలుస్తుంది. ఇక మరోవైపు ఇప్పటికే థియేటర్లలో ఈ సినిమాను వీక్షించిన ప్రేక్షకులు అటు తెలుగు వర్షన్ ఓటిటీలోకి ఎప్పుడు విడుదల కాబోతుందా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 22వ తేదీన ఈ లవ్ స్టోరీ సినిమా ఆహా లో రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: