మామూలుగా స్టార్ హీరోల సినిమాల్లో కొన్ని గతాన్ని గుర్తు చేసే సన్నివేశాలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సన్నివేశాల్లో స్టార్ హీరోల చిన్నప్పటి పాత్రలో కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు నటించడం లాంటివి చూస్తూ ఉంటాము. అయితే ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులనే ఇలా హీరోల చిన్నప్పటి పాత్రలో నటింప చేసేవారు కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఏకంగా హీరోల వారసులని చిన్నప్పటి హీరోలుగా కూడా చూపిస్తూ ఉండటం గమనార్హం. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలోకి తన తండ్రి సినిమాతోనే ఎంట్రీ ఇచ్చాడు ఘట్టమనేని వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు   గౌతమ్. సుకుమార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన వన్ నేనొక్కడినే సినిమాలో గౌతమ్ కూడా కీలక పాత్రలో నటించాడు అన్న విషయం తెలిసిందే.



 అంతేకాదు సినిమా మూవీ మొత్తం గౌతమ్ నటించిన పాత్ర సాగి పోతూ ఉండటం గమనార్హం. అంతేకాదు ఇక మహేష్ బాబు కొడుకు నటించిన పాత్ర ఈ సినిమాను మలుపు తిప్పుతుంది అని చెప్పాలి. సాధారణంగా మహేష్ బాబు సినిమాల్లో నటించడం ప్రేక్షకులకి కొత్తేమీ కాదు.. కానీ మహేష్ బాబు తనయుడు.. తెలుగు చిత్ర పరిశ్రమ బుల్లి సూపర్ స్టార్.. గౌతమ్ సినిమాల్లో నటించడం.. అది కూడా మొదటి సారి ఏకంగా తండ్రి సినిమాలో నటించడం ప్రేక్షకులకు ఎంతో ప్రత్యేకం గా మారిపోయింది అని చెప్పాలి. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించడంతో అటు ఇది చూసిన అభిమానులు అందరూ ఎంతగానో మురిసిపోయారు.



 ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఘట్టమనేని వారసుడిగా  ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాదు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా గుర్తుండిపోయే విధంగా తన నటనతో ముద్ర వేశాడు సూపర్ స్టార్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని. ఇలా చిత్ర పరిశ్రమలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చినా స్టార్ హీరో వారసుడిగా కూడా రికార్డు సృష్టించాడు. గౌతమ్ వన్ నేనొక్కడినే సినిమాలో నటించిన పాత్ర గురించి అయితే ఇప్పటికీ అభిమానులు మర్చిపోవడం లేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: