తమిళ అనువాదం అయిన రెమో చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరో ఒక్క సినిమాతోనే టాలీవుడ్ లో ఎనలేని క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఎంతో మంది తెలుగు ప్రేక్షకులు ఈ హీరో కోసం తమిళ సినిమాలు చూస్తారు అంటే అతిశయోక్తి కాదు. చాలా మంది తెలుగు అభిమానులు శివ కార్తికేయన్ నటన చూడటం కోసం అతడు తమిళ చిత్రాలను చూస్తుంటారు. తెలుగులో ఈ యంగ్ హీరోకు అంతటి క్రేజ్ ఉంది. అయితే ఈ హీరోతో ఇపుడు నేరుగా తెలుగు చిత్రం తెరకెక్కించేందుకు రెడీ అయ్యారట ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.
శివ కార్తికేయన్ మొదట డేట్స్ కొంచం కష్టం అని చెప్పినా ఆ తరువాత ఎలాగోలా అడ్జస్ట్ చేసి ఒకే చెప్పారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి ఇంతకీ ఆ సినిమా కథ ఏమిటి..?? డైరెక్టర్ ఎవరు..?? తెలుగు సినిమా ఖరారు అయినట్లేనా అంటే త్వరలో తెలియనున్నాయి. ఒకవేళ ఇది నిజం అయ్యి శివ కార్తికేయన్ తెలుగులో డైరెక్ట్ గా సినిమా తీశారు అంటే అనతి కాలంలోనే తెలుగులోనూ స్టార్ హీరో గుర్తింపు తెచ్చుకుని వరుస చిత్రాలు చేస్తారు అనడంలో అనుమానం లేదు. ఇప్పటికే తెలుగులో స్టార్ ఇమేజ్ ఉన్న ఈ హీరోకి ఈ సినిమా మరింత ప్లస్ అయ్యే అవకాసం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి