ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలు కొత్త కొత్తవి ట్రై చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలతో కొనసాగుతున్న వారు సినిమాలతో దూసుకుపోతున్నారు. అదే సమయంలో  బుల్లితెరపై కూడా హోస్ట్ అవతారమెత్తి అదరగొడుతున్నారు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు తమ లో ఉన్న కొత్త టాలెంట్ ను కూడా బయట పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోలు సినిమాల్లో స్వయంగా పాడి ప్రేక్షకులను అలరించారు. ఇలా స్టార్ హీరోలు పాడిన పాటలు కూడా ఎంతో మంది ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసాయి.


 అయితే ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్, నందమూరి బాలకృష్ణ లాంటి హీరోలు సైతం తమ గొంతు కి సాన పెట్టారు అని చెప్పాలి.. ఇప్పుడు టాలీవుడ్ మన్మధుడు అక్కినేని వారసుడు నాగార్జున కూడా మొదటిసారి సినిమాలో పాట పాడడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కింగ్ నాగార్జున బంగార్రాజు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నాగార్జున తనయుడు నాగచైతన్య కూడా నటిస్తూ ఉండటం గమనార్హం. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ప్రస్తుతం అభిమానులందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.


 ఇకపోతే ఇటీవల చిత్రబృందం అటు ప్రేక్షకులందరినీ కూడా సర్ప్రైజ్ చేస్తూ అభిమానులందరికీ ట్రీట్ ఇస్తూ ఒక పాటను విడుదల చేసింది. ఇక ఈ పాట స్పెషాలిటీ ఏమిటంటే కింగ్ నాగార్జున ఈ పాటను స్వయం గా పాడటమే. లడ్డుండా అనే  ఈ సాంగును స్వయంగా కింగ్ నాగార్జున పాడి ఆలపించాడు. ఇక పాటను భాస్కరభట్ల రాయగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. కాగా నాగార్జున హీరోగా నటిస్తున్న బంగార్రాజు సినిమా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోంది అనే విషయం తెలిసిందే..ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: