తెలుగు చిత్ర పరిశ్రమ లెజెండ్ డైరెక్టర్ దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్ లో వచ్చిన సినిమా ప్రేమాభిషేకం. ఈ సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆరో చిత్రం. ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావు సరసన శ్రీదేవి, జయసుధ హీరోయిన్లుగా నటించారు. అయితే దేవదాసు సినిమాలోని పార్వతి, చంద్రముఖిలను ప్రేరణగా తీసుకొని దాసరి నారాయణ రావు ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ సినిమా 1981 ఫిబ్రవరి 18న విడుదల చేశారు. ఈ చిత్రం అప్పట్లోనే ఎన్నో రికార్డులను సృష్టించింది. ఈ మూవీలో ఏఎన్నార్ నటనకి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.
అయితే ప్రేమాభిషేకం సినిమా వచ్చిన 13 సంవత్సరాల తర్వాత అలంటి కథనే కొంచెం మార్పులు చేసి బొబ్బిలి సింహం పేరుతో చిత్రీకరించారు. ఈ సినిమాని కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమాలో హీరోకి బదులుగా హీరోయిన్ కి క్యాన్సర్ పెట్టి దానిని దాచిపెట్టి హీరోకి మరో పెళ్లి చేస్తుంది హీరోయిన్.. దీనిని రచయిత విజయేంద్రప్రసాద్ సృష్టించారు. ఈ మూవీలో మీనా, రోజా ప్రధానపాత్రలో నటించగా.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.