సాధారణంగా సినిమాల్లో హీరోయిన్లుగా నటించే వారికి ఎంతో క్రేజ్ ఉంటుంది. హీరోయిన్ గా కాకుండా సెకండ్ హీరోయిన్ గా నటించిన కూడా కాస్త ఎక్కువ రెమ్యూనరేషన్ సొంతం చేసుకుంటూ ఉంటారు. కానీ హీరోయిన్ గా సెకండ్ హీరోయిన్ గా కాకుండా హీరో చెల్లెలి పాత్రలో అక్క పాత్రలో నటిస్తే పారితోషికము ఒక్కసారిగా తగ్గిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే సినిమాలో పాత్ర ఆధారంగా పారితోషకం కూడా ఆధారపడి ఉంటుంది. అయితే  ఇక్కడ మాత్రం సినిమాలో చెల్లెలి పాత్ర కోసం ఒక హీరోయిన్ ఏకంగా రెండు కోట్లు పారితోషికం తీసుకోవడం మాత్రం ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిపోయింది.


 సాధారణంగా స్టార్ హీరోయిన్లు హీరో చెల్లి పాత్రలో నటించేందుకు కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ తర్వాత అవకాశాలు వస్తాయో రావో అని భయపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ స్టార్ హీరో చెల్లి పాత్రలో నటించడానికి ధైర్యం చేయడమే కాదు ఏకంగా భారీగా పారితోషికం కూడా తీసుకుంది కీర్తి సురేష్. ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లు కొనసాగుతుంది కీర్తి సురేష్.  వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో అటు సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా కాకుండా కీలక పాత్రలో కూడా నటిస్తూ ఉండటం గమనార్హం.


 సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన పెద్దన్న సినిమా ఇటీవల దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రజినీకాంత్ చెల్లెలి పాత్రలో నటించింది స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.  చెల్లెలి పాత్ర చేసినప్పటికీ  రెమ్యూనరేషన్ విషయంలో ఈ అమ్మడు ఎక్కడా తగ్గలేదు. ఏకంగా సినిమాలో హీరోయిన్ పాత్రకు తీసుకున్నట్లుగా రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట ఈ ముద్దుగుమ్మ. ఇలా సినిమాలో హీరోయిన్ పాత్ర తో సమానంగా పాత్రకు కూడా రెండు కోట్లు తీసుకోవడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. కాగా ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలో కూడా కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో నటిస్తూ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: