నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా సినిమా 'బింబిసార'. ఈ సినిమాతో వశిష్ఠ వెండితెరకు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక సినిమాలో కళ్యాణ్ రామ్ కి జోడీగా కేథరీన్ ట్రెసా, సంయుక్త మీనన్, వరీనా హుస్సేన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మైథలాజికల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు బింబిసార అనే టైటిల్ ని ఫిక్స్ చేయగా.. ఏ టైం ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ అనే ట్యాగ్లైన్ కూడా జతచేశారు మేకర్స్. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. బింబిసార సినిమా టీజర్ ను నవంబర్ 29న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది.

 ఇక ఈ అప్ డేట్ ని హీరో కళ్యాణ్రామ్ ట్విట్టర్ వేదికగా అందిస్తూ ఓ వీడియోని షేర్ చేశాడు. ఆ వీడియోలో క్రూరుడు అయిన రాజు దయ లేని వాడైనా బింబిసార లుక్ లో యుద్ధంలో శత్రువులను చంపి వారిపై కూర్చున్న కళ్యాణ్ రామ్ లుక్ ఆకట్టుకుంటోంది. దీంతో ఈ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్లో 18 సినిమాగా బింబిసార రాబోతోంది. ఈ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా కళ్యాణ్ రామ్ ఓ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. గతంలో విడుదల చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. అంతే కాదు అందులో కళ్యాణ్ రామ్ లుక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కరోనా సెకండ్ కారణంగా ఆగిపోయాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర పనులు శర వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24 న విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విడుదలకు సంబంధించి ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే క్రిస్మస్ బరిలో ఇప్పటికే పుష్ప, శ్యామ్ సింగరాయ్ సినిమాలు ఉండడంతో ఈ సినిమా నిర్మాతలు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న డం విశేషం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: