ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న సినిమా ఏది అంటే అందరూ ముందుగా చెప్పే మొదటి పేరు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా అని. జనవరి 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాపై ప్రస్తుతం కేవలం భారత ప్రేక్షకుల మాత్రమే కాదు ప్రపంచ సినీ ప్రేక్షకులు మొత్తం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. అయితే జనవరి 7వ తేదీన సినిమా విడుదల ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక పాటను విడుదల చేస్తూ వస్తుంది చిత్రబృందం. సినిమా లోని ప్రతీ పాట కూడా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే విడుదలైన నాటు నాటు పాట సోషల్ మీడియా లో సెన్సేషన్ సృష్టిస్తుంది. ఇటీవలే విడుదలై అందరి హృదయాలను కదిలిస్తుంది. ఈ పాటలోని ప్రతి అక్షరం కూడా ప్రేక్షకుడి మదిని తాకుతుంది  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ పాట కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితేవిడుదల దగ్గరపడుతున్న కొద్దీ ఇక ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.  ఇక ఈ సినిమాకు సంబంధించి ఏ వార్త సోషల్ మీడియాలో కి వచ్చినా అది క్షణాల్లో  వైరల్ గా మారిపోతుంది. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు రామ్ చరణ్. అయితే ఇక ఈ పాత్రకు భార్య సీత పాత్రలో నటిస్తుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియాభట్. ఇప్పటికే ఆలియా భట్ కు సంబంధించి ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర నిడివి 15 నిమిషాలపాటు ఉండబోతుందట. అయితే కేవలం పదిహేను నిమిషాల పాటు ఉన్న పాత్ర కోసం పది రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నదట  ఈ ముద్దుగుమ్మ. అయితే ఇలా పదిహేను నిమిషాల పాత్ర కోసం ఏకంగా ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట  ఆలియా భట్. దీనిబట్టి ఒక్క రోజుకు 40 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంది అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: