టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా.. ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక వైపు యంగ్ హీరోలతోనూ నటిస్తూనే మరోవైపు సీనియర్ స్టార్తో జత కడుతోంది. సీనియర్ హీరోలలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి 'సైరా' సినిమాలో, విక్టరీ వెంకటేష్ 'ఎఫ్ 2' సినిమాలో నటించిన మిల్కీ బ్యూటీ ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు సీనియర్ హీరోలతో రొమాన్స్ కి రెడీ అయింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బోలా శంకర్' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి జోడిగా నటిస్తోంది తమన్నా. అటు మరోవైపు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 2 సినిమా సీక్వెల్ ఎఫ్3 లోనూ వెంకటేష్ తో రెండోసారి జతకట్టింది.

 ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో సీనియర్ హీరోతో కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఈ ముద్దుగుమ్మ. ఇక దాని వివరాల్లోకి వెళితే.. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుండగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి అవకాశం ఉందట. ఇక ఈ ఇద్దరు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నాను నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారట దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటికే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఎఫ్2 సినిమాలో హీరోయిన్ గానూ..

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయడం ఇక ప్రస్తుతం  ఎఫ్3 సినిమాతో మూడోసారి జత కట్టింది. ఇక ఈ సాన్నిహిత్యం తోనే బాలయ్య మూవీలో నటించేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి కి ఓకే చెప్పిందట తమన్నా. ఇక దీనిపై త్వరలోనే చిత్ర యూనిట్ తో అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అయితే గతంలో బాలయ్య సినిమాకి అవకాశం వస్తే తమన్నా రిజెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు మాత్రం బాలయ్యతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరి వెండితెరపై బాలయ్య తమన్నాల జోడి ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: