ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ఫుల్ పంచ్ డైలాగ్ లకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారు బాలకృష్ణ.. ఒకప్పుడు యువకుడిగా ఉన్నప్పుడు ఉన్న క్రేజ్ కంటే ఇప్పుడే బాలయ్య కు ఎక్కువ క్రేజ్ పెరిగిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే బాలకృష్ణ నటించిన ప్రతి సినిమా కూడా మాస్ ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగిస్తూ ఉంటుంది. ఇక బాలకృష్ణ డైలాగ్ డెలివరీ అయితే ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక డైలాగ్ ని బాలయ్య అంత పవర్ ఫుల్ గా ఏ హీరో కూడా చెప్పలేడేమో అని అనిపిస్తూ ఉంటుంది.



 అంతేకాదు బాలయ్య సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా ఒక రేంజ్ లోనే ఉంటాయి. అయితే బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ చెబుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు ఏకంగా థియేటర్లో సినిమా చూస్తున్న ప్రేక్షకులు కూడా భయపడే సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం పవర్ ఫుల్ డైలాగ్ లతో అంతకంటే పవర్ ఫుల్ హీరోయిజాన్ని పండించే బాలకృష్ణ ఒకవేళ విలన్ పాత్రలో నటిస్తే ఎలా ఉంటుంది. ఆ ఆలోచన కూడా ఊహకందని విధంగా ఉంటుంది. అంతా బాగానే ఉంది కానీ బాలక్రిష్ణ విలన్ పాత్రలో నటించడానికి ఒప్పుకుంటారా అంటే తాను విలన్ పాత్రలు చేయడానికి రెడీ అంటూ చెప్పుకొచ్చారు నందమూరి బాలకృష్ణ.



 ప్రస్తుతం బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ సినిమా సూపర్ హిట్ సాధించడంతో జోష్ లో ఉన్నారు బాలకృష్ణ. ఈ క్రమంలోనే unstoppable అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఇటీవలే అఖండ చిత్రబృందం గెస్ట్ lగా వచ్చారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియా లో విడుదలైంది. ఈ క్రమంలోనే unstoppable కార్యక్రమంలో భాగంగా ఎవరైనా రెడీగా ఉంటే తాను విలన్గా నటించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పారు నందమూరి బాలకృష్ణ. ఇక ఆ తర్వాత అందరికీ ట్విస్ట్ ఇస్తు సినిమాలో విలన్ మాత్రమే కాదు హీరో కూడా నేనే అంటూ పంచు వేశారు. దీంతో అందరూ నవ్వుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: