లెజెండరీ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతరామశాస్త్రి మనల్ని అందరినీ విడిచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. కానీ ఆయన మనస్సు మాత్రం ఎపుడు మనతోనే ఉంటుంది. టాలీవుడ్ కి సిరివెన్నెల గారికి ఉన్న సంబంధం మరువలేనిది, మరుపు రానిది. అలాంటిది ఆయన నేడు సినీ పరిశ్రమకు దూరం కావడం మన దురదృష్టకరం. ఈయన సినీ ప్రయాణంలో కోకొల్లలుగా పాటలు రచించారు. ఎన్నో విజయాలను అలవోకగా చూసారు. కాగా ఈయన రాసిన చివరి పాట చాలా ప్రత్యేకం.  నాని హీరోగా వస్తున్న 'శ్యామ్ సింగరాయ్' చిత్రంలో ఈయన చివరగా పాటలు అందించారు, అందుకే ప్రత్యేకం అన్నాము. కాగా ఈయన రాసినటువంటి పాటను ఈనెల 7న రిలీజ్ చేయబోతోంది చిత్ర బృందం. ఇదే సిరివెన్నెల రాసిన చివరి పాట కావడంతో అందరూ ఎంతో ఎమోషనల్ గా ఈ పాట కోసం ఎదురు చూస్తున్నారు.

మేకర్స్ కూడా ఈ పాటతో నిజంగా ఎమోషనల్‌ ఎటాచ్‌మెంట్‌ ఉందని  తెలిపారు. హీరో నాని ఈ పాట ప్రత్యేకతను గురించి మాట్లాడుతూ ఈ పాట మాకే కాదు అందరికీ ఎంతో ప్రత్యేకం అన్నారు. ఈ సినిమా దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాన్ వీడియో ద్వారా తన మనసులోని మాటలను సందేశం రూపంలో తెలియచేశారు.  ఈయన  మాట్లాడుతూ, నవంబర్‌ 3న సడెన్ గా సిరివెన్నెల గారి నుండి సడెన్ గా కాల్‌ వచ్చినది. ఆరోగ్యం సహకరించకపోవడంతో పాటను పూర్తి చేయలేకపోతున్నాను అని చెప్పారు. కానీ వీలైనంతవరకు ఈ పాటను పూర్తి చేయడానికి ప్రయత్నించమని మేం అంతా ఎంతగానో రిక్వెస్ట్‌ చేశాం. మరుసటి రోజు పొద్దున్నే ఆయన నుండి మరో  ఫోన్‌ కాల్ వచ్చింది.

ఆ రోజు దీపావళి. పల్లవి  చెప్తాను రాసుకోండి అని చెప్పారు. మహాభారతం బుక్‌పైన మొత్తం ఆరులైన్లు వరకు రాశాను, అందులోని ఒక లైన్‌లో సిరివెన్నెల అని ఉంది. ఎపుడు ఆయన నవ్వుతూ బహుశా ఇదే నా చివరి పాట కావచ్చేమో అని అనడం మనసును తొలచి వేసింది. విధి అంటే ఇదేనేమో...ఇదే నిజంగా ఆయన చివరి పాట అయింది. ఆయనకి అల ఎందుకు అనిపించిందో కానీ ఆయన మరణాన్ని ముందుగానే ఊహించారు. సిరివెన్నెల గారి అంత్యక్రియలు రోజునే ఆ పాటను రికార్డ్‌ చేయాల్సి వచ్చింది' అని ఎమోషనల్ అయ్యారు. ఈ మూవీలో ఆయన ఇంకో పాట కూడా రచించారు..ఈ సినిమా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి అంకితం అని హీరో నాని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: