ఇటువంటి సందర్భంలోనూ ఒకరు బిగ్ బాస్ టాప్ - 5 ఎవరెవరు ఉంటారని అడగగా? అందుకు ఆమె కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్, సంజన పేర్లు చెప్పారు. ఇక భరణి పేరు తీసుకురాగా ఆయన ఉంటారో లేదో మీరే చెప్పాలి అంటూ సెటైర్ వేసినట్టుగా కనిపించింది. విన్నర్ ఎవరు అవుతారని అడగగా, సరైన సమాధానాన్ని చెప్పలేదు. అయితే అదే సందర్భంలోనే డిమాన్ పవన్ టాప్- 5 లో ఉంటారా అని మళ్ళీ ప్రశ్నించగా? అవును ఉంటాడు.. నిన్నటి వరకు నేను కూడా హౌస్ లోనే ఉండాలని ఆడాను కానీ అది కుదరలేదు.
మొదటి రోజు నుంచి నేను బయట ఎలా ఉన్నానో లోపల కూడా అలాగే ఉన్నాను. కళ్యాణ్ తో క్లోజ్ గా ఉన్నాను కానీ దాన్ని ఎవరు అంతగా పట్టించుకో లేదు.. డిమాన్ తో ఉన్నది హైలెట్ చేసి చూపించారు. డిమాన్ పవన్ టాప్- 5 లో ఉండాలని కోరుకున్నాను, అతడే విన్నర్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను అంటూ రీతూ చౌదరి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఎవరు విన్నర్ అవుతారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి