అందరూ ఊహించిన దాని కన్నా మిన్నగా అఖండ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. సరైన సమయంలో మాస్ మూవీ పడింది అని అంతా భావించారు. జనాలు కూడా థియేటర్లో యాక్షన్ ఎపిసోడ్స్ ని చూడాలని ఆరాటపడ్డారు.

వారి కోరికను తీర్చే ఫుల్ మీల్స్ గా అఖండను ముందుకు తెచ్చారు బాలయ్య, బోయపాటి. నిజంగా డిసెంబర్ మంత్ తొలి రెండు వారాలు డ్రై సీజన్ అని అంతా అనుకున్నారు కానీ అఖండమైన విజయమే దక్కింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఇక బాలయ్య చేతిలో వరసబెట్టి సినిమాలు ఉన్నాయి బోయపాటి కూడా అదిరిపోయే ప్రాజెక్టులకు రెడీ అవుతున్నారు.

ఈ మూవీకి మరో పిల్లర్ గా నిలిచిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా తన హవాను చాటుకుంటున్నారు. సరే ఈ ముగ్గురేనా ఈ మూవీ మీద ఆశలు పెట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. వారిలో మొదట చెప్పుకోవాల్సింది శ్రీకాంత్. మొదట విలన్ తరువాత హీరో అయి వంద దాకా సినిమాలు చేసిన శ్రీకాంత్ కి ఈ మూవీ మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని భావించారు.

అయితే ఈ మూవీలో శ్రీకాంత్ క్యారక్టర్ అనుకున్నంతగా ఎలివేట్ కాలేదు అన్న మాట వినిపిస్తోంది. జగపతిబాబుని లెజెండ్ లో బాగా ఫెరోషియస్ గా చూపించిన బోయపాటి అంతటి శ్రద్ధ శ్రీకాంత్ క్యారక్టర్ మీద చూపించలేదు అన్న టాక్ నడుస్తోంది. అలాగే హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ ఈ మూవీలో నటించింది. ఆమెకు కంచె తరువాత సరైన హిట్ లేదు. ఒక విధంగా టాలీవుడ్ మరచిపోయిన్ హీరోయిన్ ఆమె.

ఆమెకు అఖండతో బంపర్ హిట్ పడింది. మరి ఆమెకు కొత్తగా చాన్స్ వస్తుందా, ఆమె కెరీర్ మళ్లీ పుంజుకుంటుందా అంటే చెప్పలేమనే అంటున్నారు. ఈ మూవీ అంతా బాలయ్య వన్ మ్యాన్ ఆర్మీలా నడిపించాడు. దాంతో హీరోయిన్ ప్రాధాన్యత కూడా పెద్దగా లేదని అంటున్నారు. మొత్తానికి భారీ ఆశలు పెట్టుకున్న ప్రగ్యా, శ్రీకాంత్ ఇద్దరి దశ తిరిగితే మాత్రం అఖండ సక్సెస్ కి ఒక అర్ధం ఉంటుంది అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: