టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి గట్టి పోటీ ఉంది. కరోనా సెకండ్ల తర్వాత పెద్ద సినిమాలు ఇప్పుడిప్పుడే రిలీజ్ అవుతున్నాయి. గత ఏడాది నుంచి రిలీజ్ కాకుండా ఉన్న పెద్ద సినిమాలకు వచ్చే సంక్రాంతి మంచి వేదికగా మారింది. ఈ క్రమంలోనే రాజమౌళి ఆర్ఆర్ సినిమాతో పాటు ప్రభాస్ రాధే శ్యామ్‌ సినిమా, పవన్ కళ్యాణ్ - రానా కాంబినేషన్ లో వస్తున్న భీమ్లా నాయ‌క్‌ సినిమాలు ఇప్పటికే సంక్రాంతికి గురిపెట్టాయి.

ఆర్ ఆర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న థియేటర్లలోకి దిగుతుంది. రాధే శ్యామ్ పాన్ ఇండియా సినిమా గా వస్తుండడంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది. ఇక పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విషయంలో మాత్రం కాస్త సందేహం ఉంది. ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేస్తున్నామని ప్రతిసారి నిర్మాతలు ప్రకటిస్తున్నారు.

నిర్మాత నాగ వంశీ సైతం ఎట్టి పరిస్థితుల్లోనూ త‌మ‌ సినిమా సంక్రాంతికి వస్తుందని క్లారిటీ ఇవ్వడంతో అపోహలు అయితే తొలగాయి. అయితే భీమానాయక్ సినిమాను సంక్రాంతి రేసు నుంచి తప్పించడానికి నెలరోజులుగా ఇండస్ట్రీలో అన్నివైపుల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్నాయట. నిర్మాత దిల్ రాజు తో పాటు కొందరు డిస్ట్రిబ్యూటర్లు సైతం భీమ్లా నాయ‌క్ నిర్మాతలపై విపరీతమైన ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

విచిత్రమేంటంటే మరోవైపు రాధే శ్యామ్‌ సినిమా సైతం సంక్రాంతికే షెడ్యూల్ అయి ఉంది. ఆ సినిమాను వదిలేసి కేవలం భీమ్లానే మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. రాధే శ్యామ్‌ సినిమా గురించి ఎవరూ మాట్లాడటం లేదు. భీమానాయక్ నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ... రాధేశ్యామ్ సినిమాను ఫిబ్రవరికి వాయిదా వేయించ వచ్చు క‌దా ? అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మండిపడుతున్నారు . కారణం ఏమిటన్నది తెలియదుగానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు ప‌వ‌న్ సినిమాను సంక్రాంతి రేసు నుంచి తప్పించడానికి అయితే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: