ఆ విధంగా టాలీవుడ్ లో టాప్ 5 హీరో లలో ఒకరిగా నిలిచిన విజయ్ దేవరకొండ ఈ చిత్రంతో తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి అయితే నిజంగా ఏర్పడింది ఎందుకంటే ఆయన గత చిత్రాలు డియర్ కామ్రేడ్ మరియు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. డియర్ కామ్రేడ్ ఓ వర్గం ప్రేక్షకులకు ఎంతగానో మెప్పించింది కానీ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదు. దాంతో ఈ సారి తప్పకుండా ఆయన ఒక అర్జున్ రెడ్డి రేంజ్ లో హిట్ అందుకోవడం తప్పనిసరి అయింది. దాంతో పాటు విజయాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ మాత్రం వెనుకబడి పోవడం ఆయన అభిమానులను ఏ మాత్రం అలరించడం లేదు..
ఈ సారి విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు వచ్చే వేసవిలో రాబోతున్నాడు. మరి ఆయన గత సినిమాలు అర్జున్ రెడ్డి గీత గోవిందం టాక్సీవాలా వంటి మ్యాజిక్ ఈ సినిమాలో కనిపిస్తుందా అనేది చూడాలి. స్టార్ కాకముందు హీరోగా సినిమాలు చేసేటప్పుడు ఎలాంటి అంచనాలు ఉండవు కాబట్టి అవి కొంత బాగున్న కూడా అవి సూపర్ హిట్ గా నిలుస్తాయి. కానీ స్టార్ అయ్యాక ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు ఉంటాయి ఆ అంచనాలకు ఏమాత్రం కొంచెం తగ్గినా కూడా అవి భారీ గా నిరాశ కలిగిస్తూ ఉంటాయి. మరి ఇప్పటికే ఫస్ట్ లుక్ తో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ ఈ సినిమా తో ప్రేక్షకుల అంచనాలను భారీగానే అందుకుంటాడా అనేది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి