ఐకానిక్ స్టార్ , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప - ది రైజ్‌ సినిమా రెండు సంవత్సరాల పాటు ప్రేక్షకులను ఎట్టకేలకు ఊరించి ఊరించి ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు ముందు నుంచే మంచి హైప్ ఉంది. గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సింగిల్స్ - టీజ‌ర్లు -  ట్రైలర్ లతోనే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. దీనికి తోడు బన్నీ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో అదిరిపోయే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది.

గతంలో బన్నీ - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య , ఆర్య 2 సినిమాలు హిట్ అవడంతో కచ్చితంగా వీరి కాంబినేషన్లో ఈ సినిమా అవుతుందని అందరూ ఆశ‌లు పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే కంప్లీట్ అయిన ప్రీమియర్ షోల ద్వారా మంచి టాక్ వస్తోంది. ఇదిలా ఉంటే బన్నీకి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మల్లువుడ్ అభిమానులకు పుష్ప రిలీజ్ రోజున పెద్ద షాక్ తగిలింది.

అనివార్య కారణాల చేత పుష్ప సినిమా రిలీజ్ ను  అక్కడ ఒక రోజు వాయిదా వేస్తున్నారు. వాస్తవంగా ఈ రోజు అక్కడ రిలీజ్ కావాల్సి ఉన్నా రేపటి నుంచి అక్కడ థియేటర్లలోకి రానుంది. ఫాహ‌ద్‌ పజిల్ కూడా పుష్ప లో  కీలకపాత్ర పోషించడంతో మల్లువుడ్ లో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తమన్నా ఊ అంటావా మావ‌ అనే స్పెషల్ సాంగ్ లో నటించింది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఇక సినిమా కు ఓ వ‌రాల్‌గా ప‌ర్లేదు అన్న టాక్ అయితే ముందుగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: