టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ తీస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ భారీ మూవీలో కృష్ణంరాజు, భాగ్యశ్రీ, షాషా ఛత్రి, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళి శర్మ తదితరులు ఇతర పాత్రలు చేస్తుండగా ఇటీవల వరుసగా విజయాలతో దూసుకెళ్తున్న భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రభాస్ ఈ సినిమాలో విక్రమాదిత్య అనే హస్త సాముద్రిక నిపుణుడిగా నటిస్తుండగా ప్రేరణ అనే పాత్రలో కనిపించనుంది పూజా. మంచి లవ్ కం రొమాంటిక్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తీస్తున్నట్లు టాక్. ఇప్పటికే ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉండగా ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ వాటిని మరింతగా పెంచాయి. విషయం ఏమిటంటే, నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని ఐదు భాషల్లో రిలీజ్ చేసారు. నిజంగా రాధేశ్యామ్ ట్రైలర్ అద్భుతమైన విజువల్ వండర్ లా ఉందని అన్ని భాషల ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోందని అంటున్నారు మూవీ యూనిట్.

 అయితే ప్రస్తుతం ఆ ట్రైలర్ అన్ని భాషల్లో ఆకట్టుకుంటూ దూసుకెళ్తుండగా తెలుగు ట్రైలర్ గడచిన 24 గంటల్లో ఏకంగా 22 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని ఇప్పటివరకు టాలీవుడ్ లో నాలుగున్నరేళ్లుగా ఎవరూ బీట్ చేయలేని బాహుబలి 2 ట్రైలర్ రికార్డు ని బద్దలు కొట్టి సరికొత్త సెన్సేషనల్ రికార్డు ని నెలకొల్పింది. దీనితో ప్రభాస్ మరొక్కసారి తన గత రికార్డు తానే బద్దలుకొట్టారు. కాగా ప్రస్తుతం ఈ ట్రైలర్ 532 కె లైక్స్ దక్కించుకోవడంతో పాటు అటు హిందీ వర్షన్ ట్రైలర్ కూడా ఏకంగా 20 మిలియన్ వ్యూస్ దక్కించుకోవడం విశేషం అని అంటున్నారు విశ్లేషకులు. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే రాధేశ్యామ్ రేపు రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో ఏమో అంటూ పలువురు ప్రేక్షకాభిమానులు ఇప్పటి నుండే చర్చలు మొదలెట్టేసారు. ఇక రాధేశ్యామ్ మూవీ రానున్న సంక్రాంతి కానుకగా జనవరి 14న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: