ప్రభాస్, పూజా హెగ్దే జంటగా నటించిన రాధే శ్యామ్ సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకుంది. ఒమిక్రాన్ వల్ల దేశంలో చాలా చోట్ల థియేటర్లు మూతపడుతున్న కారణంగా సినిమా మరోసారి వాయిదా వేశారు. అయితే నిర్మతాలకు బయట నుండి ఒత్తిళ్లు ఎక్కువవడం వల్ల సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేస్తారన్న టాక్ వినిపిస్తుంది. రాధే శ్యామ్ ఓటీటీ రిలీజ్ పై కొన్ని రీజన్స్ చెబుతున్నారు.

సినిమా పీరియాడికల్ లవ్ స్టోరీగా వస్తుంది. అంటే ఓన్లీ క్లాస్ ఆడియెన్స్ కు తప్ప మాస్ కి ఎక్కే అవకాశం చాలా తక్కువ. అంతేకాదు సినిమా థియేట్రికల్ రిలీజ్ ఎప్పుడవుతుంది అన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పడం కష్టమే. అందుకే నిర్మాతలు ఈ సినిమాను ప్రముఖ ఓటీటీకి అమ్మేయాలని చూస్తున్నారు. ఆ ఓటీటీ సంస్థ కూడా రాధే శ్యామ్ సినిమాకు 300 కోట్ల ఆఫర్ ఇచ్చిందట. అయితే పే పర్ వ్యూ ద్వారా పెట్టిన మొత్తాన్ని రాబట్టుకోవాలని చూస్తున్నారు. ఓటీటీ లో 300 కోట్లు అంటే పెద్ద మొత్తమే. పే పర్ వ్యూ పద్ధతిలో చేస్తే మాత్రం వాళ్లు సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది.

ప్రభాస్ కూడా రాధే శ్యామ్ మీద ఎక్కువ రోజులు ఫోకస్ చేయలేకపోతున్నాడు. ఈ సన్ర్కాంతికి రిలీజ్ పక్కా అనుకున్న సినిమా కాస్త వాయిదా పడటం ప్రభాస్ ని నిరుత్సాహపరచింది. మళ్లీ దేశంలో మాములు పరిస్థితి వచ్చే దాకా ఈ సినిమాని ఆపడం కష్టమనే టాక్ వినిపిస్తుంది. మరి మేకర్స్ ఏం చేస్తారో చూడాలి. రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న రాధేశ్యాం మూవీ ట్రైలర్ మాత్రం సినిమాపై భారీ అంచనాలను ఏర్పరచింది. తప్పకుండా సినిమా ఆ రేంజ్ కు తగినట్టుగా ఉంటుందని అంటున్నారు. సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సౌత్ భాషల్లో మ్యూజిక్ అందించారు. రాధేశ్యాం సినిమాకు ఎస్. థమన్ బిజిఎం అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: