గ్లోబల్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తున్న ‘వారణాసి’
రాజమౌళి మార్క్ అంటేనే గ్రాండ్ ఎలిమెంట్స్, విజువల్ వండర్స్, ఎమోషనల్ కనెక్ట్! ఈసారి మహేష్ బాబుతో కలిసి ఆయన చేస్తున్న ఈ భారీ చిత్రం, కేవలం ఇండియన్ మార్కెట్కే పరిమితం కాకుండా, గ్లోబల్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తోంది. షూటింగ్ జరుగుతున్న ప్రతి దశలోనూ, ఎక్కడా తగ్గకుండా.. రాజమౌళి తన విజన్ అంగుళం కూడా మిస్ అవ్వకుండా చిత్రీకరిస్తున్నారు. మరోవైపు, సినిమా షూటింగ్ తో పాటు, గ్లోబల్ లెవల్‌లో సినిమాను ప్రమోట్ చేయడంలో కూడా రాజమౌళి ప్లానింగ్ వేరే లెవల్‌లో ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సరిహద్దులు దాటుతున్న ప్రమోషన్లు.. మెక్సికో నుండి ఫ్రాన్స్ వరకు!
రాజమౌళి స్టైలే వేరు. సినిమా రిలీజ్ తర్వాత ప్రమోషన్లు చేయడం ఒక ఎత్తైతే, సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ప్రపంచవ్యాప్తంగా అంచనాలను పెంచడం ఆయన ప్రత్యేకత. తాజాగా మెక్సికోలో జరిగిన ఒక అంతర్జాతీయ ఈవెంట్‌లో ‘వారణాసి’ టీమ్ పాల్గొని, అక్కడ విశేష స్పందనను అందుకుంది. ఇది ప్రారంభం మాత్రమేనని, అసలైన ప్రమోషన్ల జాతర ఇప్పుడే మొదలైందని చెప్పవచ్చు.ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. జూన్ నెలలో రాజమౌళి గ్లోబల్ టూర్‌కు ప్లాన్ చేస్తున్నారు! జూన్ చివరి వారంలో జక్కన్న ఫ్రాన్స్‌కు వెళ్లనున్నారు. అక్కడ ఆయన పలు సిరీస్ ఆఫ్ ఈవెంట్లలో పాల్గొని, ‘వారణాసి’ ప్రాజెక్ట్ విశేషాలను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు.ఈ విషయంపై ఎస్.ఎస్. కార్తికేయ కూడా స్పందిస్తూ, "ఈ టూర్ చాలా ఫన్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది" అని పేర్కొనడం, ఫ్యాన్స్‌లో అంచనాలను మరింత పెంచేసింది.
ఎందుకు ఈ గ్లోబల్ టూర్స్?
ప్రతి స్టార్ డైరెక్టర్ కూడా సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక ప్రమోషన్లు మొదలుపెడతారు. కానీ, రాజమౌళి ప్లానింగ్ పూర్తిగా భిన్నం. షూటింగ్ ఏ స్థాయిలో జరుగుతుందో, అదే స్థాయిలో ప్రమోషన్స్ కూడా జరగాలని ఆయన నమ్ముతారు. ‘వారణాసి’ చిత్రాన్ని ఒక గ్లోబల్ ఐకాన్‌గా మార్చడానికి, ఇలాంటి అంతర్జాతీయ ప్లాట్‌ఫారమ్స్ ఉపయోగించుకోవడం ఒక అద్భుతమైన వ్యూహం. హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్స్, గ్లోబల్ డిస్ట్రిబ్యూటర్స్‌తో ముందే పరిచయాలు ఏర్పరచుకోవడం.సినిమా రిలీజ్ సమయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను సిద్ధం చేయడం.‘వారణాసి’ని ఒక వరల్డ్ క్లాస్ సినిమాగా ప్రెజెంట్ చేయడం.ఇలా మొత్తానికి సందు దొరికినప్పుడల్లా తన వారణాసి చిత్రాన్ని గ్లోబల్ లెవెల్లో ప్రెజెంట్ చేయడంలో మాత్రం రాజమౌళి ప్లానింగ్ వేరే లెవెల్ అని చెప్పాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి