తమిళనాడు ఎన్నికలలో సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ అధినేత విజయ్ పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఆయన గురించి ఎన్నో రకాల విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇదే క్రమంలోనే విజయ్ కు ఒక సోదరి ఉండేదని చాలామందికి తెలియదు. అయితే ఆమె పేరు కూడా విద్య. ఆమె 1980లో జన్మించింది. కానీ 1984 మే 20న అనారోగ్య సమస్యతో చిన్న వయసులోనే మరణించిందట. వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లిన ఫలితం లేదు. తన చెల్లి మరణంతో విజయ్ చాలా కృంగిపోయారని ఆయన తల్లి కూడా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.


స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక విజయ్ ఎక్కువగా తన చెల్లెలు విద్యతోనే ఆడుకునే వారని తనే స్నానం చేయించి ,అన్నం కూడా తినిపించేవారు. కానీ అలాంటిది ఒక్కసారిగా తన చెల్లెలు దూరం అవ్వడంతో విజయ్ చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని. తీవ్ర మనోవేదనకు కూడా గురయ్యారని అందుకే తన కూతురికి విద్య పేరుని గుర్తుకు వచ్చేలా పెట్టుకున్నారంటు తెలియజేసింది.  అంతేకాకుండా తన ప్రొడక్షన్ బ్యానర్ కు కూడా విద్య విజయం ప్రొడక్షన్ బ్యానర్ అని పెట్టారు.



ఒకానొక సందర్భంలో తన చెల్లెలు గురించి కూడా విజయ్ మాట్లాడుతూ .. తన జీవితంలో పెద్ద ప్రభావం మా చెల్లెలు విద్య మరణమే ఆ విషాదం నుంచి తాను కోలుకోవడం కూడా చాలా కష్టంగా మారింది. అందుకే నా అభిమానుల రూపంలో చాలామంది చెల్లెళ్లను తాను చూసుకుంటున్నానని చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ఈ విషాదం జరగకముందు విజయ్ చాలా చురుకుగా అల్లరి చేసేవారు ఎక్కువగా మాట్లాడే వారిని కానీ తన చెల్లెలు విద్య మరణం తర్వాత పూర్తిగా మారిపోయారని తెలిపారు విజయ్ తండ్రి.


అలాగే విజయ్ తన కార్ నెంబర్లకు 0277 అని ఒక ప్రత్యేక నెంబర్ ని ఉపయోగిస్తుంటారు. అయితే ఈ నెంబర్ తన సోదరి విద్య (14వ తేదీ ఫిబ్రవరి 1977) ఆమె పుట్టినరోజుగా తన సోదరి పైన ఉండే ప్రేమతో విజయ్ ఇప్పటికే ఆ నెంబర్ ను ఉపయోగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: