కొన్ని సార్లు కథ డిమాండ్ చేస్తే ఒకే హీరో రెండు పాత్రలు చేయాల్సి ఉంటుంది. విభిన్న కథాంశాలతో డ్యుయల్ రోల్స్ చేయడం అనేది ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ఫార్ములా అనే చెప్పాలి. ఎప్పుడో ఎన్టీఆర్‌ ‘రాముడు-భీముడు’ నుండి ఇపుడు స్టార్ హీరోల వరకు పలువురు హీరోలు ఒకే సినిమాలో విభిన్న పాత్రలు చేసి అలరించారు. మెగా స్టార్ చిరంజీవి కూడా ఇలాంటి సినిమాలు చాలానే చేసి మంచి విజయాలను అందుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు చిరు కెరీర్ కి నిచ్చెనగా మారాయి. అలాంటి వాటిలో ఒకటి చిరు నటించిన "రౌడీ అల్లుడు" మూవీ. 1991 అక్టోబర్‌ 18న విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది.

ఇందులో చిరు రెండు పాత్రలను పోషించారు. కోట్లకు పడగెత్తిన మేనల్లుడు కల్యాణ్‌ పాత్ర ఒకటి కాగా, ఆటో జానీగా మరో పాత్రలో చిరు తన నట విశ్వ రూపాన్ని చూపించారు. ఇందులో దివ్య భారతి, శోభనలు హీరోయిన్లు గా చేశారు.  అయితే ఈ సినిమా వెనుక ఒక చిత్రమైన సంఘటన జరిగిందట. వివరాల్లోకి వెళితే...  అంతకు ముందే గ్యాంగ్ లీడర్ వంటి బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న చిరు రౌడీ అల్లుడు సినిమా కథను విన్నారట. అయితే మొదట ఇందులో ఒకటే పాత్ర...చిరు ఈ సినిమాలో ఇంకేదో కావాలి, డబుల్ రోల్ ట్రీట్ ఇస్తే బాగుంటుంది అని ఐడియా ఇవ్వగా... దాంతో ఆ కథలో మరో పాత్రను జొప్పించి మళ్ళీ చిరుకి వినిపించగా అప్పుడు మెగాస్టార్ హ్యాపీ అయ్యి ఒకే అన్నారట.

అయితే చిరుకి తప్ప మిగిలిన వారందరికీ ఈ కథ మార్పులు చేయడంతో ఎంతో కొంత సందేహం గానే ఉండగా...విడుదలయ్యాక రిజల్ట్ చూసి అందరూ షాక్ తిన్నారట. అంతగా సినిమాలో చిరంజీవి ఒలికించిన రెండు పాత్రలు కూడా హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ వసూళ్ల వర్షం కురిపించింది. అలా చిరు ఆలోచన సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది అని ఇండస్ట్రీలో అంటుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: