అయితే తన అభిమాన హీరోల కుటుంబ సభ్యుల గురించి, వారి వివరాలు తెలుసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. అందుకే ఇపుడు విక్టరీ వెంకటేష్ సతీమణి నీరజ గారి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.
విక్టరీ వెంకటేష్ భార్య పూర్తి పేరు నీరజ రెడ్డి, వీరిది కులాంతర వివాహం. పెద్దలు కుదిర్చిన సంబంధమే. ఈమె సొంతూరు ఆంధ్రలో చిత్తూరు జిల్లాలోని మదనపల్లి. పాలిటిక్స్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ వీరిది. నీరజ గారు అబ్రాడ్ లో ఎంబిఎ పూర్తి చేశారు. ఈమె చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటారు. గొప్పింటి వారసురాలు, బాగా చదువుకున్న వ్యక్తి, కీర్తి ప్రతిష్టలు ఘనంగా ఉన్న ఇంటికి కోడలు అయినప్పటికీ చాలా సాదాసీదాగా జీవించే వ్యక్తి. అందరి ముందు హైలెట్ అవడం అసలు ఇష్టం ఉండదట. ఫంక్షన్లకు కానీ, ఈవెంట్లకు కానీ ఎప్పుడూ వచ్చిందే లేదు అని చెప్పాలి. ఇక ఒక గృహిణిగా ఆమె బాధ్యతలను నిర్వర్తించడం లో నెంబర్ వన్ కొడలనే చెప్పాలి.
ఒక వైపు ఇంటి వ్యవహారాలు, బాధ్యత, పిల్లల చదువులు ఇలా దాదాపుగా అన్నిఆమె చూసుకుంటారట. భర్త వెంకటేష్ కు చెప్పకుండా ఏ పని చేయరట నీరజ. ఇన్నేళ్లు గడచినా ఇప్పటికీ అన్ని విషయాలు తన అనుమతి తీసుకునే చేస్తారని, నీకు నచ్చింది చేయి అన్నా వినరని సన్నిహితులతో భార్య నీరజ గురించి చెబుతుంటారట వెంకటేష్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి