బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ ఓ వ్య‌క్తిపై ప‌రువు న‌ష్టం దావా వేసారు. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఉన్న కంటెంట్‌ను వెంట‌నే తొల‌గించాలి లేదా బ్లాక్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాల‌ని.. ఆయ‌న త‌ర‌పు న్యాయబృందం కోర్టును కోరిన‌ది. మీడియా, సామాజిక మాధ్య‌మాల్లో అవ‌మాన‌క‌ర వ్యాఖ్య‌ల‌తో త‌న ప‌రువు పోతుంద‌ని.. స‌ల్మాన్‌ఖాన్ కోర్టుకు ఫిర్యాదు చేసాడు. ప‌న్వేల్‌లోని త‌న ఫాంహౌస్ స‌మీపంలో ఉండే వ్య‌క్తి కేత‌న్ క‌క్క‌డ్‌పై ముంబ‌యి సిటీ సివిల్ కోర్టులో ఆయ‌న త‌రుపు న్యాయ‌వాదులు పిటిష‌న్ దాఖ‌లు చేసారు. వెను వెంట‌నే ఆయా మాద్య‌మాల్లో సల్మాన్‌కు వ్య‌తిరేకంగా కంటెంట్‌ను తొల‌గించే విధంగా లేదా బ్లాక్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాల‌ని స‌ల్మాన్‌కు సంబంధించిన‌ న్యాయ‌బృందం కోర్టును కోరింది.

కేత‌న్ నెల రోజుల కింద‌ట ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కించ‌ప‌రిచే విధంగా మాట్లాడారు. ఈ త‌రుణంలోనే కేతన్‌తో పాటు మ‌రొక ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను గూగుల్, యూట్యూబ్, ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్ త‌దిత‌ర సోష‌ల్ మీడియా సంస్థ‌లను ఈ కేసులో చేర్చారు. స‌ల్మాన్‌ను దూషిస్తూ.. అవ‌మానిస్తూ పోస్టులు పెట్ట‌డం, కంటెంట్ అప్‌లోడ్ చేయ‌డం, ట్వీట్లు, ఇంట‌ర్వ్యూలు, ప్రింటింగ్, ప‌బ్లిషింగ్, బ్రాడ్ కాస్టింగ్ త‌దిత‌ర అన్ని మార్గాల‌పై నిషేదం విధించే విధంగా మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేయాలి అని న్యాయ‌బృందం కోర్టును కోరింది.

మ‌రొక‌వైపు కేత‌న్ త‌రుపు న్యాయ‌వాదులు ఈ నిషేదాన్ని వ్య‌తిరేకిస్తూ.. త‌మ వాద‌న‌లు వినిపించేందుకు కొంత స‌మ‌యం ఇవ్వాల‌ని కోర్టును అభ్య‌ర్తించారు. దీనితో కోర్టు కేత‌న్‌కు అనుకూలంగా స‌మ‌యం మంజూరు చేసిన‌ది. ఈ కేసును జ‌న‌వ‌రి 21కి మ‌ర‌ల వాయిదా వేయ‌డంతో కేత‌న్ కు కాస్త అనుకూలంగా అయిన‌ట్టు అయింద‌ని వారి న్యాయ‌బృందం పేర్కొంటున్న‌ట్టు స‌మాచారం. ముఖ్యంగా ఓ స్టార్ హీరోకు జ‌రిగిన ఇంత అవ‌మానం జ‌రిగితే త‌ప్ప‌కుండా అత‌నికి న్యాయం జ‌ర‌గాలని ప‌లువురు నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో కోరుతున్నారు. మ‌రోవైపు కోర్టులో కేసు ఉండ‌గానే.. కొంత మంది కామెంట్ చేయ‌గా.. మ‌రికొంద‌రూ ఇలా కామెంట్ చేస్తే ఇబ్బందులు ఎదుర్కుంటామ‌ని గ్ర‌హించి కాముగా ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: