రామ్ చరణ్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన ‘ఆర్ ఆర్ ఆర్’ పాన్ ఇండియా స్టాయిలో హాట్ టాపిక్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అన్న అంచాలు ఉన్నాయి. దీనికితోడు ‘బాహుబలి’ తరువాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ చరిత్ర సృష్టిస్తుంది అన్న  అభిప్రాయం తెలుగు ప్రజలలో ఉంది.    


ఈ అంచనాలను నిలబెట్టుకోవడానికి రాజమౌళి టీమ్ ఈ మూవీ పై  20 కోట్లు ప్రమోషన్స్ కి ఖర్చు పెట్టాడు అని అంటారు. ముఖ్యంగా ముంబై  లో రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ తో కలిసి దాదాపు వారం రోజులు మకాం వేసి అక్కడి కీలక మీడియాలో వరుస ప్రమోషన్స్ చేయడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ ఉత్తరాదిలోనూ హాట్ టాపిక్ గా మారింది. దీనితో ఈసినిమాకి దేశవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమని రాజమౌళి లెక్కలు కూడ వేసుకున్నాడు.


జనవరి 7న వరల్డ్ వైడ్ గా 14 బాషల్లో రిలీజ్ అని ప్లాన్ చేసినప్పటికీ కరోనా థర్డ్ వేవ్ ‘ఆర్ ఆర్ ఆర్’ కు అడ్డుకట్ట వేసింది. ఇప్పుడు  ఈ సినిమాకు సంబంధించి బాలీవుడ్ మీడియాలో వస్తున్న కొన్ని కామెంట్స్  ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ ను కలవర పెడుతున్నట్లు టాక్. ఈ మూవీకి  సంబంధించిన ప్రమోషన్ లో తారక్ చరణ్ ఇద్దరు నార్త్ ఆడియన్స్ పెద్దగా ఇంప్రెస్ చేయలేరు అంటూ బాలీవుడ్ మీడియాలోని కొన్ని వర్గాలు కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  


వాస్తవానికి  బాలీవుడ్ మీడియా ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ఎందుకు ప్రచారంలోకి  తీసుకు వచ్చిందో క్లారిటీ లేకపోయినా ఇప్పుడు కోవిడ్ కారణంగా ఈ మూవీ వాయిదా  పడటంతో  మరోసారి ఉత్తరాదిలో ‘ఆర్ ఆర్ ఆర్` కు సంబంధించి ప్రమోషన్స్ చేయాలి. కాబట్టి రాజమౌళి రానున్న రోజులలో ఈ కామెంట్స్ ను దృష్టిలోపెట్టుకుని ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రమోషన్ లో ఎలాంటి మార్పులు చేస్తారో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: