కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున- నాగ చైతన్య కలిసి నటించిన సినిమా బంగార్రాజు. ఈ సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 'సోగ్గాడు చిన్నినాయన' కి సీక్వెల్ గా రూపొందించిన సంగతి అందరికి తెల్సిందే.

పండగ కానుకగా వచ్చిన ఈ సినిమా మొదటి వారం పూర్తయ్యేలోపు 90శాతం రికవరీని  సాధించింది అనే చెప్పాలి. అంతేకాదు.. రెండో వీకెండ్ అలాగే రిపబ్లిక్ డే హాలిడే కూడా 'బంగార్రాజు' కి కలిసొచ్చే అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా.. కొత్త సినిమాలు రిలీజ్ అయితే సోషల్ మీడియాలో ఆ మూవీ గురించి ఏదో ఒక డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. తాజాగా బంగార్రాజు సినిమా విషయంలో కూడా అదే చర్చ జరుగుతుంది. ఇక ఈ సినిమాలో ఓ లాజిక్ ను కనిపెట్టి.. నెటిజన్స్ తెగ చర్చలు జరుపుతున్నారు.

అయితే ఇంతకీ ఆ చర్చ ఏంటంటే.. సోగ్గాడే చిన్నినాయన' కి ఎండింగే ఈ చిత్రానికి ఆరంభంగా చూపించి సినిమా స్టార్ట్ చేశారు. ఇక ఈ చిత్రం ప్రారంభంలో చిన్న బంగార్రాజు తల్లి సీత(లావణ్య త్రిపాఠి) చనిపోయినట్టుగా చూపిస్తారు. ఆ తరువాత పెద్ద 'బంగార్రాజు' స్వర్గంలో రంభ ఊర్వశి మేనకాలతో డ్యూయెట్ లు వేసుకుంటున్నట్టు చూపించాడు. వారితో ఆట - పాట అయిపోయాక సత్య అలియాస్ సత్తెమ్మ(రమ్యకృష్ణ) స్వర్గంలోకి వచ్చినట్టు చూపించారు. మళ్ళి వాళ్ళిద్దరూ భూమ్మీదకి రావడం ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దడం వంటి సన్నివేశాలను చూపించారు.

అంత బాగానే ఉంది కదా.. ఇంతకీ లాజిక్ ఎక్కడ మిస్ అయ్యింది అనుకుంటున్నారా. అదేంటంటే.. సత్తెమ్మ కంటే ముందు చనిపోయిన సీత ఎందుకు స్వర్గంలో కనిపించలేదు అనేది నెటిజన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా పరంగా ఇక్కడ లాజిక్ మిస్ అయినట్టే..! కానీ ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి ఉంటే చైతన్యకి తల్లిగా చూపించాల్సి వచ్చేది. ఇక అప్పటికే చైతన్య సరసన లావణ్య హీరోయిన్ గా నటించింది కాబట్టి.. ఆమె పాత్రని ఈ చిత్రంలో కంటిన్యూ చేయడం బాగుండదని ఆలోచించి పెట్టలేదు. సినిమాని ఎంజాయ్ చేయాలి కానీ.. లాజిక్స్ చూపించకూడదు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: