మన దర్శకులు కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టారని గత రెండు మూడు సంవత్సరాలుగా వస్తున్న సినిమాల కాన్సెప్టులను బట్టి తెలుస్తుంది. సినిమా అటు ఇటు అయినా కూడా వారి కాన్సెప్ట్ లు ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. అంతే కాదు వారి దర్శకత్వ ప్రతిభ ను కూడా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆ విధంగా హీరోల ను ఎంతో అద్భుతంగా చూపించి టాలీవుడ్ సినిమాలను హీరో సెంట్రిక్ సినిమాలు గా ప్రజెంట్ చేసే వారు గతంలో మన దర్శకులు. కానీ ఇటీవల కాలంలో వస్తున్న సినిమాలను చూస్తుంటే అన్ని రకాల పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు.

ముఖ్యంగా హీరో తల పడిపోయే విలన్ పాత్రలను హీరో కు దీటుగా ఒకానొక సందర్భంలో హీరో కంటే ఎక్కువగా ఉండేలా వారు సదరు పాత్రలను డిజైన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాల లో రాబోతున్న చిత్రాలు గమనిస్తే హీరోల కంటే ఎక్కువగా రిలయన్స్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు మన దర్శకులు. అలా టాలీవుడ్ లో స్టైలిష్ విలన్స్ గా ఇటీవల కాలంలో ప్రేక్షకులను అలరించిన ఇప్పుడు చూద్దాం.

ఉప్పెన సినిమాలో విలన్ గా చేసిన నటుడు విజయ్ సేతుపతి ఇప్పుడు మళ్లీ ఓ తెలుగు సినిమాలో విలన్ గా చేసే ఆలోచనలో ఉన్నాడు. మహేష్ త్రివిక్రమ్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటించబోతున్నాడు. సరైనోడు చిత్రంలో విలన్ గా చేసి అల్లు అర్జున్ కంటే ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు ఆది పినిశెట్టి. ఇప్పుడు మరొక సినిమాలో ఆయన తెలుగు లో విలన్ గా నటించబోతున్నాడు. హీరో కార్తికేయ ఇప్పటికే విలన్ గా నటించిన విషయం తెలిసిందే.  ఇక హీరోలుగా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న సుశాంత్ మరియు వెనున్తొట్టెం పూడి కూడా ఇప్పుడు విలన్స్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇంకా చాలామంది స్టైలిష్ విలన్స్ తెలుగు సినిమాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: