ఈ ఇద్దరు హీరోలకు బయట ప్రేక్షకుల్లో దాదాపుగా సమానంగా  పాపులారిటీ ఉంది. అయితే ఆ  ఇద్దరి హీరోల డ్యాన్సుల కోసం మాత్రమే  సినిమాలను చూసే అభిమానులు ఉన్నారంటే.. ఇక ఆ  హీరోలకు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో మనం  సులభంగా అర్థం చేసుకోవచ్చు.  అయితే తాజాగా టాలీవుడ్ ప్రముఖ కొరియో గ్రాఫర్ బృంద మాస్టర్ కు ఈ ఇద్దరు హీరోలలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరనే ప్రశ్న ఎదురైంది... అయితే  ఆ ప్రశ్నకు బృంద మాస్టర్ చాలా  తెలివిగా సమాధానం చెప్పుకొచ్చాడు .అయితే  స్టైలిష్ మూమెంట్స్ ను బన్నీ మాత్రమే  బాగా చేస్తారని ...ఇంకా షార్ప్ మూమెంట్స్ ను మాత్రం ఎన్టీఆర్ బాగా చేస్తారని బృంద మాస్టర్ చాలా తెలివిగా తన జవాబును వెల్లడించారు.

వారి వారి స్టైల్ లలో వారి పర్ఫామెన్స్ లను వారిద్దరు ఎప్పుడూ ఇరగదీస్తూ ఉంటారు.... ఎవరి స్టైల్ వారివి కాబట్టి వారిద్దరిని పోల్చి చెప్పడం కరెక్ట్ కాదు అని బృంద మాస్టర్ అభిప్రాయపడడం జరిగింది. ఇకపోతే యంగ్ హీరోలు అయినా జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు ఇండస్ట్రీలోకి ఒకేసారి అడుగు పెట్టడం జరిగింది.అయితే బన్నీ కెరీర్ తొలినాళ్లలో మాత్రం  క్లాస్ సినిమాలలో ఎక్కువగా నటిస్తే.... జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మాస్ సినిమాలలో ఎక్కువగా నటించారు. అలా వారి కెరియర్ ను ప్రారంభించిన కూడా నెమ్మదినెమ్మదిగా వారి దారులను మార్చుకున్నారు . 

తరువాత ఈ ఇద్దరు హీరోలు రూటు మార్చి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక తాజాగా ఈ ఇద్దరు హీరోలు వేరువేరు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో మంచి విజయాన్ని అందుకోగా...ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తో ఆ గుర్తింపు వస్తుందని నమ్ముతున్నారు.ఇకపోతే బన్నీ తర్వాతి ప్రాజెక్ట్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.... ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ మాత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనుంది.  ఇకపోతే ఈ రెండు సినిమాలు ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది... కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాల షూటింగ్ లు మొదలవుతాయో లేదో చూడాల్సి ఉంది మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: