టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రజెంట్ లైన్ అప్ చూస్తుంటే అందరూ అవాక్కవుతున్నారు. భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వరస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు ప్రభాస్. ముఖ్యంగా 2022 లో ప్రభాస్ సినిమాలు ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయనున్నాయి. ప్రతి సినిమాలోనూ ప్రభాస్ క్యారెక్టర్ సరికొత్తగా కనిపించబోతోంది. ప్రతి పాత్ర కూడా ఎంతో పవర్ పుల్ గా ఉండనుంది. ఇక వాటిలో 'రాధేశ్యామ్' సినిమాలో ప్రేమికుడి పాత్రలో నటిస్తున్నాడు. ఆ తర్వాత నటిస్తున్న 'ఆదిపురుష్' లో శ్రీరాముడి పాత్రలో కనువిందు చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. 2022 ఆగస్టు 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.మరోవైపు రాధే శ్యామ్ కూడా ఇదే ఏడాది మార్చి నెలలో థియేటర్లలోకి రానుందని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు 2022లో విడుదల కానుండగా.వీటి బిజినెస్ సుమారు వెయ్యి కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. కేవలం రెండు సినిమాలతోనే వెయ్యి కోట్ల బిజినెస్ అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు ఏ సౌత్ హీరో కి ఈ రేంజిలో బిజినెస్ జరగలేదు. ఇక మరోవైపు ఈ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె, సలార్, స్పిరిట్ వంటి సినిమాలు 2023లో విడుదల కానుండగా..

 వాటి బిజినెస్ కు సంబంధించి సుమారు రెండు వేల కోట్ల వరకు జరగవచ్చని టాక్ నడుస్తోంది. దాని ప్రకారం చూసుకుంటే 2022, 2023 ఈ రెండు సంవత్సరాలలో బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ హవానే ఎక్కువగా ఉండబోతోంది. ఇక ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెలలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఈ సినిమాతో పాటు ప్రాజెక్ట్ కే షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొన్బోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. మళ్లీ ఇటీవల కరోనా విజృంభించడంతో షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చారు.కాగా తాజా సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాలను సమాంతరంగా షూటింగ్ చేయాలని ప్రభాస్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: