బాలయ్య హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ షో ఎవరు ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించింది.. దీనితో అన్ స్టాపబుల్ సీజన్2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానుల అంచనా ప్రకారం సీజన్ 1 రాని వారు సీజన్ 2 లో వచ్చే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇకపోతే కొంతమంది ఈ సీజన్లోనే హాజరు కావాల్సి ఉన్నా కూడా వారికి కుదరకపోవడంతో కొన్ని అనివార్య కారణాలవల్ల సీజన్ 1 లో వారు హాజరు కాకపోవడం జరిగింది. ఇకపోతే తాజాగా వచ్చే సీజన్లో ఎవరెవరు హాజరు అవుతారు వారికి సంబంధించిన పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం సీజన్ 2 లో వచ్చే గెస్ట్ లిస్టులో చిరంజీవి తప్పకుండా హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి మరియు బాలకృష్ణ ఇద్దరూ ఒకే ఫ్రేమ్లో అభిమానులకు కనిపిస్తే వారి ఆనందానికి అంతులేకుండా పోతోంది. అంతేకాకుండా  ఈ షోకు పని చేస్తున్న బీవీఎస్ రవి సైతం చిరంజీవి ఈ షోకు రానున్నట్టు కన్ఫామ్ చేశారు.  వీరే కాకుండా వీరితో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ కూడా లిస్టు లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం ఎలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కి మరియు బాలయ్య కి మధ్య ఎలాంటి విభేదాలు లేకపోయినప్పటికీ ఏదో ఉన్నట్లు గా సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి.

అందుకే ఆ ప్రచారాలకు చెక్ పెట్టే దిశగా బాలయ్య తారక్ ఒకే తెరపై కనిపించనున్నారని తెలుస్తోంది.  వీరితో పాటుగా వెంకటేష్, సమంత, చంద్రబాబు నాయుడు కూడా ఈ షోకు గెస్టులుగా హాజరు కానున్నారని సమాచారం.  లిస్టు లో ఇంత మంది ఉన్నప్పటికీ ఎంతమంది ఈ షో కి హాజరు అవుతారో చూడాలి.ఇకపోతే అన్ స్టాపబుల్ సీజన్1 సక్సెస్ సాధించడంతో సీజన్2 పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.అయితే స్టాపబుల్2 అంచనాలకు తగిన విధంగా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.  బాలయ్య హోస్ట్ గా చేస్తున్న ఈ షో సీజన్ 2 త్వరలోనే రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: