పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు, ఆ తర్వాత మళ్లీ వకిల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నాడు, అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో ఒకటి హరిహర వీరమల్లు.  ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.  ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ అంగీకారంతో క్రిష్ జాగర్లమూడి, పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కొండపొలం అనే సినిమాను తెరకెక్కించాడు, ఈ సినిమా కొంత కాలం క్రితమే విడుదల అయ్యింది. ఇలా కొండపొలం  సినిమా పనులన్నీ పూర్తి కావడంతో క్రిష్ జాగర్లమూడి ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాపై ఫోకస్ పెట్టాడు, అయితే ఈ సినిమా షూటింగ్ అప్పుడు ప్రారంభం అవుతుంది... ఇప్పుడు ప్రారంభం అవుతుంది అంటూ అనేక వార్తలు బయటకు వస్తున్నాయి, కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం తిరిగి ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు, అయితే తాజాగా మరోసారి ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

 ఈ మూవీలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు, హార్స్ రైడింగ్‌లుంటాయి, ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, పోస్టర్‌లను బట్టి చూస్తే మూవీ ఏ రేంజ్‌లో ఉండబోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, బ్రిల్లియంట్ డైరెక్టర్, మంచి వ్యక్తి అయిన డైరెక్టర్ క్రిష్‌తో హరిహర వీరమల్లు మూవీ లో పవన్ కళ్యాణ్ సర్‌తో చేయబోయే తదుపరి యాక్షన్ షెడ్యూల్ గురించి చర్చిస్తున్నాను అని స్టంట్ డైరెక్టర్ శామ్ కౌశల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  ఇలా హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: