ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే దగ్గుబాటి రానా కలిసి చేసిన మూవీ 'భీమ్లా నాయక్' కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం లో పవన్ కు జోడిగా నిత్యా మీనన్ చేస్తుండగా... ఈ సినిమా వల్ల ఆమె కెరియర్ మళ్ళీ ట్రాక్ ఎక్కినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు వరుస విజయాలతో ఫామ్ లో ఉన్న నిత్య మీనన్ కు ఈ మధ్య తెలుగులో అవకాశాలు తగ్గిన విషయం తెలిసిందే. అయితే ఇపుడు 'భీమ్లా నాయక్' చిత్రంతో ఈమె మళ్ళీ బిజీ అవనుంది అని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె వరుసగా తెలుగులో మూడు స్టార్ హీరోల చిత్రాలకు సైన్ చేసినట్లు సమాచారం.

భీమ్లా నాయక్ కనుక అందరూ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబడితే మిగిలిన స్టార్స్ విషయం పక్కన పెడితే హీరోయిన్ నిత్య మీనన్ సుడి తిరిగినట్లే. మునుపటి కన్నా స్పీడ్ గా చాన్స్ లు అందుకోనుంది  అని తెలుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యపనుమ్ కోషియమ్' సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. రీ ఎంట్రీ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్న పవన్ కు ఈ సినిమా మరింత ప్లస్ కానుందని ఘన విజయాన్ని తెచ్చి పెడుతుందని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ఒక వైపు సినిమా ప్రమోషన్స్ చూస్తుంటే సినిమా హిట్ కాదు బ్లాక్ బస్టర్ అయ్యేలా కనిపిస్తోంది. మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న 'అయ్యపనుమ్ కోషియమ్' మూవీకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంటుంది టీం అంటున్నారు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రచనా సహకారం అందించిన విషయం తెలిసిందే. ఎస్ ఎస్ థమన్ స్వరాలూ సమకూర్చిన ఈ సినిమాలోని పాటలు అన్నీ ఇప్పటికే విడుదల అయ్యి మంచి పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: