టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా లో 'ప్రాజెక్ట్ కె' కూడా ఒకటి. ప్రస్తుతం ప్రభాస్సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

 ఇప్పటికే కంప్లీట్ అయిన మొదటి షెడ్యూల్లో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక ఇప్పుడు రెండో షెడ్యూల్లో అమితాబచ్చన్ ప్రభాస్ పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. దిగ్గజ నటీనటులు నటిస్తున్నఈ సైన్స్ ఫిక్షన్ త సినిమాలో టెక్నీషియన్లు కూడా అదే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రాజెక్ట్ కె సినిమా కోసం ఓ బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ ని మేకర్స్ రంగంలోకి దింపబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో బ్రహ్మాస్త్ర,షంషేరా వంటి భారీ సినిమాలకు పని చేసిన ప్రఖ్యాత బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పర్వేజ్ షేక్ ఇప్పుడు.. ప్రభాస్ ప్రాజెక్ట్ కె కోసం పనిచేస్తున్నారు.

 తాజాగా ఈ స్టార్ కొరియోగ్రాఫర్ ప్రాజెక్ట్ కే షూటింగ్ కి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా లోని ముఖ్యమైన యాక్షన్ బ్లాక్ కి కొరియోగ్రఫీ చేస్తున్నారు పర్వేజ్. ప్రస్తుతం ప్రభాస్ అందుకు సంబంధించిన షూటింగ్ లో పాల్గొంటున్నారు. యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోని మెయిన్ హైలెట్ గా ఉండబోతుందట. అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మరోవైపు ప్రభాస్ ఇటీవల నటించిన 'రాధేశ్యామ్' సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: