మహేశ్ బాబు కూతురు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. మహేశ్‌ సినిమాల్లోని పాటలతో సితార చేసే డాన్సులకి బోల్డన్ని కాంప్లిమెంట్స్‌ వస్తుంటాయి. దీంతో సితార సినిమా ఎంట్రీ గురించి కూడా బోల్డన్ని చర్చలు జరుగుతుంటాయి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తుందా, డైరెక్ట్‌గా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందా అని నెటిజన్లు క్వశ్చన్లు కూడా అడుగుతున్నారు.

సితార ఎంట్రీ గురించి మహేశ్ బాబు గానీ, నమ్రతా శిరోద్కర్‌ గానీ ఓపెన్‌ స్టేట్మెంట్స్‌ ఇవ్వలేదు. అయితే మహేశ్‌ కొడుకు గౌతమ్‌ కృష్ణ ఆల్రెడీ కెమెరాముందుకొచ్చాడు. మహేశ్ బాబు, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'వన్-నేనొక్కడినే' సినిమాలో నటించాడు గౌతమ్. ఈ మూవీ తర్వాత మళ్లీ గౌతమ్‌ సినిమాల్లో నటించలేదు. ఇక మహేశ్‌ కూడా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గానే సినిమాల్లోకి వచ్చాడు. ఆ తర్వాత హీరోగా సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. అల్లు అర్జున్‌ పిల్లలకి సోషల్‌ మీడియాలో క్రేజీ ఫాలోయింగ్‌ ఉంది. బన్ని పిల్లలు అయాన్, ఆర్హ ఇద్దరూ 'అల వైకుంఠపురములో' సినిమాని ప్రమోట్ చేశాడు. 'ఓ మైగాడ్ డాడీ' ప్రమోషన్‌ సాంగ్‌లో యాక్ట్ చేశారు. అలాగే ఈ అన్నాచెల్లెల్లు ఇద్దరూ అంజలి కవర్‌ సాంగ్‌లో కూడా కనిపించారు. గుణశేఖర్‌ దర్శకత్వంలో వస్తోన్న మైథాలజీ మూవీ 'శాకుంతలం'లో నటించింది అర్హ.

జూ.ఎన్టీఆర్‌ పిల్లలు అభయ్‌ రామ్, భార్గవ్‌ రామ్‌ ఎంట్రీ గురించి చర్చలు జరుగుతుంటాయి. 'శాకుంతలం' సినిమా షూటింగ్‌ టైమ్‌లో తారక్‌ పిల్లలు కెమెరాముందుకు వస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఈ బుడ్డోళ్లు కెమెరా ముందుకు రాలేదు. అయితే జూ.ఎన్టీఆర్‌ కొడుకు ఉంటే ఫ్యాన్స్‌కి ఎక్స్‌ట్రా కిక్‌ వస్తుంది కాబట్టి, వీళ్లని సినిమాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారట మేకర్స్.

'మాస్టర్' సినిమాలో విజయ్, విజయ్‌ సేతుపతి కలిసి నటిస్తే బాక్సాఫీస్‌కి కూడా బోల్డంత ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు 'బీస్ట్' సినిమాలో కూడా ఇలాంటి మేజిక్‌ రిపీట్‌ కాబోతోంది. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటించట్లేదు గానీ, ఈ హీరో కొడుకు సూర్య సేతుపతి నటిస్తున్నాడు. సినిమాలో చిన్నప్పటి విజయ్‌గా కనిపించబోతున్నాడట సూర్య సేతుపతి. ఇక విజయ్ సేతుపతి కూతురు శ్రీజ సేతుపతి ఆల్రెడీ 'ముగిళ్' సినిమాతో జనాలని పలకరించింది. విక్రమ్ కొడుకు ధృవ్‌ విక్రమ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి విజయ్ కొడుకు జాసన్‌ సంజయ్ లాంచింగ్‌ గురించి వార్తలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: