ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ ఏ రేంజ్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నాడో మన అందరికి తెలిసిందే, క్రాక్ సినిమా కంటే ముందు వరుస అపజయాలతో డీలా పడిపోయిన మాస్ మహారాజ రవితేజ క్రాక్ సినిమా విజయంతో వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్నాడు,  ప్రస్తుతం రవితేజ ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను ఓకే చేయడం,  ఆ సినిమాను కూడా సెట్స్  పైకి తీసుకు వెళ్లడం ఆ సినిమా షూటింగ్ ని కూడా చక చక పూర్తి చేయడం జరుగుతుంది.  ఇందులో భాగంగా ఇప్పటికే రవితేజ 'ఖిలాడి'   సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసి థియేటర్ లోకి తీసుకు వచ్చాడు,  ఈ సినిమా ఫిబ్రవరి 11 వ తేదీన భారీ ఎత్తున ధియేటర్ లలో విడుదల అయ్యింది,  ఈ సినిమా తెలుగు తో పాటు హిందీలో కూడా విడుదల అయ్యింది.  

ఎన్నో అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలయిన ఖిలాడి సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది,  ఇది ఇలా ఉంటే రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ,  ధమాకా,  రావణాసుర సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది,  అసలు విషయంలోకి వెళితే... క్రాక్  సినిమా తర్వాత రవితేజ క్రేజ్ అమాంతం పెరిగిన విషయం మనందరికీ తెలిసిందే,  అయితే రామారావు ఆన్ డ్యూటీ సినిమా విషయంలో రవితేజ రోజువారి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.  అయితే ఒక రోజుకు రవితేజ 50 లక్షల వరకు రెమ్యూనరేషన్ పుచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి , మొత్తంగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా కోసం రవితేజ 17 నుంచి 18 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.  రవితేజ కెరియర్ లోనే ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ హైయెస్ట్ అని వార్తలు వస్తున్నాయి, రవితేజ ఈ సినిమాతో పాటు టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలో కూడా నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: