మిషన్ ఇంపాజిబుల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా. ఫన్నీ ప్రమోషన్ వీడియోస్ లను షేర్ చేస్తూ సినిమా పై మరింత ఆసక్తిని పెంచారు చిత్రబృందం. ఇక ఏప్రిల్ ఒకటో తారీకున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమైనట్లుగా ఒక పోస్టు ద్వారా తెలియజేశారు. ఇక ఈ నెల 15వ తేదీన ఈ సినిమా ట్రైలర్ను ప్రేక్షకుల ముందుకు విడుదల చేయబోతున్నారు. ఇక అలాగే హీరో సూర్య తో తమిళ్ లో ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేయబోతున్నారు. అయితే తమిళ్లో ట్రైలర్ డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు.
ఇక ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తున్నారు కాబట్టి ఈ చిత్రం మరింత హైప్ పెరుగుతుందనే నమ్మకాన్ని తెలియజేస్తున్నారు చిత్రబృందం. ఇక ఈ సినిమా స్టోరీ గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రం కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చుతుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ చిత్రం కదా తిరుపతి సమీపంలోని ఉండే ఒక గ్రామంలో జరిగి నట్లు గా తెలుస్తున్నది. ఈ చిత్రాన్ని అన్ని అన్వేష్ రెడ్డి నాగార్జున రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి