టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన 'రాధేశ్యామ్' సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా పూజా హెగ్డే నటించింది. మార్చి 11న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. కాగా ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. ముఖ్యంగా క్లాస్ ఆడియెన్స్ ను ఈ సినిమా ఆకట్టుకుంటోంది. పిరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ నని ఆకట్టుకోవడంలో విఫలం అయిందనే  చెప్పాలి. 

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించాడు అందాల రాక్షసి ఫేమ్ హను రాఘవపూడి. ఈ మేరకు ఈ సినిమా చూసి ట్విట్టర్లో తన స్పందన కనబరుస్తూ.. 'రాదే శ్యామ్ లాంటి సినిమా చాలా అరుదుగా వస్తుంది. సోదరుడు రాధాకృష్ణ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రభాస్ ని విక్రమాదిత్య లాగా చూడడం విజువల్ ట్రీట్ లా అనిపించింది. పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో అద్భుతంగా జీవించింది. ఈ ఏ పిక్ లవ్ స్టోరీని సిల్వర్ స్క్రీన్ పై వీక్షించి అద్భుతమైన అనుభూతిని పొందండి' అంటూ ట్వీట్ చేశాడు దర్శకుడు హను రాఘవపూడి దీంతో. రాధేశ్యామ్ సినిమాపై ఆయన చేసిన ఇట్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

  ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు కృష్ణంరాజు, జగపతి బాబు, మురళి శర్మ, భాగ్యశ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సుమారు మూడు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఇక టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని అందుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా 119 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని అందుకున్నట్లు సమాచారం. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ రేంజ్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం అనే చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: