వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఫ్యాన్స్ ను తెగ ఊరించిన పాన్ ఇండియా మల్టీ స్టారర్ మూవీ ఎట్టకేలకు నేడు విడుదలయ్యింది. ఇన్నాళ్ళు వెయిట్ చేసిన అభిమానుల కల నెరవేరడమే బ్లాక్ బస్టర్ టాక్ తో అభిమానులను మనసులను సంతోష పరవశంలో ముంచేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా ..మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టిన మరో సినిమా అన్ని చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జక్కన్న అభిమానులకు ఒక విజువల్ ఫీస్ట్ అని చెప్పాలి. కెమెరాలో బంధించిన ప్రతి ఒక్క ఫ్రేమ్ చూడచక్కగా ఉంది. ఈ సినిమా టాక్ ను బట్టి ఒక్క విషయం సినిమా వర్గాల్లో వైరల్ గా మారింది. అయితే ఇది రాజమౌళి ప్రతిష్టకు భంగం అని చెప్పాలి.

ఉదయం నుండి అన్ని రకాల ఆన్లైన్ వెబ్ సైట్ లు, సోషల్ మీడియాలలో ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు ఇచ్చాయి. అంతే కాకుండా ఈ సినిమాకు రేటింగ్ 5 కు 3 కు పైనే ఇచ్చాయి. దీనిని బట్టి సినిమా బ్లాక్ బస్టర్ కాకపోయినా, హిట్ అని సినిమా వర్గాలు అనుకుంటుంన్నాయి. అయితే కొన్ని మీడియా చానెళ్లు ఇచ్చిన రివ్యూలను చూస్తే ఈ సినిమా ఇంతకు ముందు వచ్చిన రాజమౌళి సినిమాలకు ధీటుగా మాత్రం లేదని క్లియర్ గా అర్ధమవుతోంది. రాజమౌళి దీనికి ముందు తెరకెక్కించిన బాహుబలి లాంటి అఖండమైన సినిమా ముందు ఇది దరిదాపుల్లో కూడా లేదు. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు, అయితే అందులో పాత్రలు, కథ, ట్విస్ట్ లు, వేషధారణ, మేక్ అప్ ఇలా ప్రతి ఒక్క విషయంలో బాహుబలి ని ఎవ్వరూ తప్పు పట్టలేరు.

కానీ ఈ సినిమాలో ఎంచుకున్న కథ బాగున్నా మధ్యలో ట్రాక్ తప్పింది. పాత్రలను సరిగా వాడుకోవడంలో తడబాటు... సినిమాలో పెద్దగా ట్విస్ట్ లు లేకపోవడం, అన్నింటికన్నా మించి ఎన్టీఆర్ దుస్తులు, మేక్ అప్ విషయంలో చాలా దారుణంగా ఉండడం. ఇలా పైన చెప్పుకున్న ప్రతి ఒక్క విషయంలో రాజమౌళి సక్సెస్ కాలేకపోయాడు. ఇది ఎవ్వరు ఔనన్నా కాదన్నా నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR