పూరి జగన్నాద్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమా జనగణమణ. ఇటీవలే ఈచిత్రానికి సంబంధించిన లాంచ్ ను గ్రాండ్ గా చేశారు. ముంబైలో అతిరథ మహారథుల సమక్షంలో ఈ సినిమాను లాంచ్ చేయగా త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. అలా విజయ్ దేవరకొండ తో వరుసగా రెండవ సినిమా చేస్తున్న పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి కూడా ఆయనే హీరోగా ఎంచుకోవడం ఇండస్ట్రీ వర్గాలను ఎంతగానో ఆశ్చర్యపరిచింది.

ఏదేమైనా కూడా వీరిద్దరి మధ్య అనుబంధం బాగా ఏర్పడడం తోనే ఇది సాధ్యమైందని చెప్పుకుంటున్నారు. భవిష్యత్తులో వీరి కాంబినేషన్లో మరిన్ని సినిమాలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అందరూ భావిస్తున్నారు. లైగర్ సినిమాతో వీరిద్దరూ చేతులు కలిపారు. ఈ సినిమా తప్పకుండా భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందని వారు నమ్ముతున్నారు. అయితే తొలిసారిగా వీరి కలయికలో వచ్చిన ఈ సినిమా విడుదల కాకముందే ఫలితాన్ని చూడకముందే వారు ముందే సినిమా సూపర్ హిట్ అవుతుందని ఊహించి రెండో సినిమా కూడా మొదలు పెట్టడం విశేషం.

అలా గతంలో మహేష్ పవన్ వెంకటేష్ వంటి హీరోలతో చేయాలనుకున్నా పూరి జన గణ మన సినిమాను ఇప్పుడు చేయడం ఎంతో విశేషం. విజయ్ లో స్టామినా చూసి ఈ సినిమాను ఆయనతో చేయాలని ఆయన భావించాడో తెలియట్లేదు కానీ తప్పకుండా ఈ సినిమాకు విజయ్ సెట్ అవుతాడు అని మాత్రం కొంతమంది చెబుతున్నారు. ఇప్పటికే లైగర్ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల కాగా ఆ బాక్సర్ క్యారక్టర్ కు తగ్గట్టుగా విజయ్ దేవరకొండ నటించాడు. అందుకే కాబోలు పూరి జగన్నాథ్ వరుసగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ లో నటించే అవకాశాన్ని విజయ్ దేవరకొండ కు అందించాడు. ఇక విజయ్ దేవరకొండ అ తదుపరి సినిమాలను కూడా ఈ స్థాయిలోనే వుండే విధంగా ప్లాన్ చేశాడు. సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: