బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద ఫ్యానో..  ఆయన మన పవన్ కళ్యాణ్ ని ఎంత అభిమానిస్తాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాలలో ఆయన ప్రేమని మరియు ఆయన మీద బండ్ల గణేష్ కి ఉన్న అభిమానాన్ని మనం చూశాం.అయితే సందర్భమేదైనా సరే.. పవన్‌ పేరు చెబితేనే పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటాడు బండ్లన్న.ఇక  ఆ అభిమానంతోనే పవన్‌ని దేవర అని ప్రేమగా పిలుచుకుంటారు. కాగా అలా ఆయనపై ఉన్న అభిమానాన్ని బండ్ల మరోసారి చాటుకున్నాడు. ఇకపోతే తాజాగా ఆసక్తికరమైన ట్వీట్‌ చేసి సోషల్‌ మీడియాను షేక్‌ చేశారు. ఇక ఇంతకీ విషయమేమిటంటే.. 

భీమ్లానాయక్‌ తర్వాత పవన్‌ కల్యాణ్‌  నటిస్తోన్న చిత్రం హరిహర వీరమల్లు. ఇకపోతే క్రియేటివ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఎప్పుడో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. కాగా ఎట్టకేలకు ఇటీవల షూటింగ్‌ మళ్లీ పట్టాలెక్కింది.అయితే  రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ సినిమాను త్వరగా పూర్తి చేసే ఉద్దేశంతో పవన్‌ కూడా సినిమా సెట్లోకి అడుగుపెట్టాడు. ఇకపోతే చారిత్రక కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్‌స్టార్‌ వజ్రాల దొంగగా కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఇందులో యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం పవన్‌ రిహార్సల్స్‌ ప్రారంభించారు.ఇక  ప్రముఖ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ టోడర్‌ లాజరోవ్‌తో కలిసి కొన్ని పోరాట సన్నివేశాలు ప్రాక్టీస్‌ చేశారు. 

అయితే వీటికి సంబంధించిన ఫొటోలను చిత్ర బృందం సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అవికాస్తా వైరల్‌గా మారాయి.అయితే ఇవే ఫొటోలను ట్విట్టర్‌ లో షేర్‌ చేసిన బండ్ల గణేశ్‌ 'గన్ను పట్టినా, పెన్ను పట్టినా, కత్తి పట్టినా, మైకు పట్టినా.. ఏది పట్టినా ఎవరిపై గురి పెట్టినా మీకు తిరుగులేదు దేవర' అని రాసుకొచ్చారు. ఇకపోతే దీంతో ఈ ట్వీట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక హరిహర వీరమల్లు సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఎం.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్గా నటిస్తుండగా.. అర్జున్‌ రామ్‌పాల్‌, నర్గీస్‌ఫక్రి, ఆదిత్య మేనన్‌, శుభలేక సుధాకర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాకుండా ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.ఇక  తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, మలయాళం భాషల్లో సినిమా విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: